Gundeninda GudiGantalu Today episode December 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి అడ్డంగా దొరికిపోయిన కూడా తన తప్పేమి లేదని బుకాయిస్తుంది. దాంతో సత్యం సీరియస్ అవుతాడు. నేను పచ్చి మంచినీళ్లు ఇచ్చిన తీసుకోరు కదా నేను వెళ్ళిపోతాను అని రూమ్ లోకి వెళ్లి ప్రభావతి లాక్ చేసుకుంటుంది.. అందరూ కూడా ప్రభావతి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. తలుపు తీయకుండా లోపల ఉండిపోతుంది ప్రభావతి. సత్యం దగ్గరికి అందరూ వచ్చి మీరు వెళ్లి అతని పిలవండి తలుపు తీయట్లేదు అని ఎంతగా బ్రతిమలాడిన కూడా సత్యం మాట వినడు.. నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపొమ్మంటారా అని సత్యం అంటారు. ప్రభావతి లోపలికి వెళ్లి తలిపేసుకుంటుంది. ఎవరు ఎంతగా పిలిచినా కూడా బయటకు రాదు. మనోజ్ రోహిణి మాత్రం తలుపు దగ్గరే ఉండి ఆమెను బ్రతిమలాడుతూ బయటికి రమ్మని పిలుస్తూ ఉంటారు. బాలు మీన అలాగే రవి శృతి కూడా అక్కడికి వచ్చి రమ్మని పిలిచినా బయటికి రాదు ప్రభావతి. అయితే బాలు ఇన్ని తప్పులు మీద తప్పులు చేసినా కూడా ఆవిడ ఇంకా పౌరుషంగా ఉంది ఎన్ని రోజులు ఉంటుందో ఉండనివ్వండి అని అంటాడు. కానీ రోహిణి మనోజ్ లు మాత్రం ఆవిడ ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత అని అంటారు. కామాక్షి రావడంతో ప్రభావతి బయటకు వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కామాక్షి ప్రభావతి తప్పులేదని ఎంత చెప్పినా సరే సత్యం మాత్రం మీనాకు క్షమాపణ చెప్పాలి అని అంటాడు.. నాకేమీ క్షమాపణ చెప్పొద్దు మావయ్య అని మీనా అంటున్న సరే నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టావు నా కొడుకుల ముందు నన్ను దోషి లాగా నిలబెట్టావు.. ఇన్ని చేసింది దేనికోసం బంగారం కోసమే కదా ఈగో ఈ బంగారం తీసుకొని నీ బొంద మీద కొట్టుకో అని తన చేతికున్న గాజులని మీనా పై విసిరి కొడుతుంది.
ప్రభావతి చేసిన పనికి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. మీనా మాత్రం ఆ గాజులను మోహన కొట్టగానే బాధపడుతుంది. సత్యం మీ నాకు అవమానం జరిగిందని బాధపడుతూ ఉంటాడు. ఈ పని నా కన్నతల్లి కాకుండా ఇంకొకరు చేసి ఉంటే చంపేసేవాన్ని అని బాలు అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా అని ప్రభావతి అనగానే ఏయ్ నోరు ముయ్యి అని అంటాడు. అక్కడే ఉన్న కామాక్షి గొడవ పెద్దదవుతుందని ప్రభావతిని రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది. మీనాకు క్షమాపణలు చెప్తే ఏమైంది తప్పు మీ వైపు ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాలి కదా అనేసి కామాక్షి అంటుంది. కానీ ప్రభావతి సీరియస్గా ఏంటి ఆ పూలు అమ్ముకునే దానికి నేను క్షమాపణ చెప్పాలా అని అంటుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను దానికి క్షమాపణ చెప్పను అని సీరియస్గా చూస్తుంది. నువ్వు అలా సీరియస్ గా చూడొద్దు వదిన ఎందుకో ఏంటో ఆలోచించి ఒకసారి అనేసి కామాక్షి అంటుంది.
మీనాక్షికి క్షమాపణ చెప్పడానికి కామాక్షి అన్ని విధాలుగా ప్రయత్నించి ఒప్పించడానికి చూస్తుంది. ఈ గొడవ అంత కావడానికి కారణం మనోజ్ అని అందరూ మనోజ్ ని తిడుతూ ఉంటారు. వీడు కనుక 40 లక్షలు మింగినట్టు ఆ నగలను మింగకుండా ఇప్పుడు ఈ గొడవలు వచ్చేవి కాదు కదా అనేసి అంటాడు బాలు. చిన్నప్పుడు నుంచి నిన్ను ఆవిడ ఎంతో తెలివైన వాడివి. నువ్వు ఎక్కడో సింహాసనం మీద కూర్చో పెడతావు అని చాలా కలలు కనండి ఇలా చేస్తావని అస్సలు ఊహించి ఉండదు అని బాలు అంటారు. అమ్మకి ఇలా జరగడానికి కారణం నువ్వే అని బాలు అంటాడు.
ఇదంతా కాదు నువ్వు తీసుకెళ్ళిన 40 లక్షలు.. ఇప్పుడు మీనావి 4 లక్షలు మొత్తం కలిపి 44 లక్షలు ఎప్పుడు కడతావో చెప్పు అని బాలు అడుగుతాడు. అదంతా కాదన్నయ్య 40 లక్షల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు మీనా వదినకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు ఇప్పుడే కట్టాలి ఎప్పుడు కడతావో చెప్పు అని రవి కూడా బాలుకి సపోర్ట్ చేసి మాట్లాడుతాడు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు అని మనోజ్ అంటాడు. డబ్బులను మింగినప్పుడు ఈ ఆలోచన నీకు రాలేదా అని బాలు అంటాడు. కానీ మనోజ్ మాత్రం నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వలేను నావల్ల కాదు అనేసి అంటాడు.
డబ్బులకి బదులుగా ఆంటీ గాజులు ఇచ్చింది కదా అని శృతి అంటుంది. అది ఇవ్వడం అని అంటారా మోహన విసిరి కొట్టింది అవి మాకేం అవసరం లేదు అని బాలు అంటాడు. చిన్నప్పటినుంచి నువ్వు ఎంతో తెలివైన వాడివి అని మీ అమ్మ నిన్ను గారాభం చేసి పెంచింది. ఇప్పుడు ఇలాంటి తప్పులు చేస్తూనే పోతూనే ఉంటావా.. ఇంకా నువ్వు జీవితంలో మారవా అనేసి సత్యము అడుగుతాడు. ఇప్పటికైనా నువ్వు మారి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు అని సత్యం అంటాడు.. కానీ మనోజ్ మాత్రం నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవనే చెప్తాడు. రోహిణి మామయ్య నాకు ఒక అవకాశం ఇవ్వండి మనోజ్ చేసిన తప్పుని నేను సరిదిద్దుతాను అని రోహిణి అంటుంది.
మనోజ్ మీనాకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు నేను ఏర్పాటు చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని రోహిణి రిక్వెస్ట్ చేస్తుంది. సత్యం సరే ఒప్పుకోరా తను ఇస్తుందని చెప్పింది కదా అని అంటాడు. ఈ గాజులు నేను అత్తయ్యకి ఇస్తాను ఆ డబ్బులను ఎలాగోలాగా ఏర్పాటు చేస్తాను అని రోహిణి మాట ఇస్తుంది.. రోహిణి ఇస్తుందని చెప్పడంతో బాలు సరే అంటాడు. ఇక అందరూ కలిసి ఎవరి రూములకు వాళ్ళు వెళ్ళిపోతారు.. కామాక్షి ప్రభావతికి ఎంత చెప్పినా సరే నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు దీని గురించి మాట్లాడొద్దు అని ప్రభావతి అంటుంది. నువ్వు అలా మొండిగా ఉంటే ఎలా వదిన నువ్వు అన్నయ్య ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడు అని క్లాసులు పీకుతుంది.
Also Read : ‘బ్రహ్మముడి’ కళ్యాణ్ లవ్ స్టోరీ.. పెళ్లి అలా జరిగిపోయిందా..?
అప్పుడే ఎవరో తలుపు తట్టడంతో ఎవరు వచ్చినట్లున్నారు నేను చూస్తాను ఆగు అని కామాక్షి తలుపు తీస్తుంది.. మనోజ్, రోహిణి వచ్చి అత్తయ్య మీ గాజులు ఇవిగోండి అని అంటుంది. ఈ గాజులు నువ్వు తెచ్చావ్ ఏంటి నేను ఆ మీనా మోహన విసిరి కొట్టాను కదా.. మళ్లీ వీటిని ఇక్కడ తెచ్చావ్ ఏంటి అని ప్రభావతి అడుగుతుంది. ఆ మీనా వద్దని చెప్పింది ఆ నాలుగు లక్షలు నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను అని రోహిణి అంటుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…