E-Paper
Advertisement

OTT Movie : పాడు చేసినోడిని పాడెక్కించే అమ్మాయి…. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : పాడు చేసినోడిని పాడెక్కించే అమ్మాయి…. ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా
Advertisement

OTT Movie : ఇప్పుడు కోర్ట్‌రూమ్ జానర్ లో వస్తున్న స్టోరీలు వాడి వేడి వాదనలతో ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి భాషలో ఇలాంటి జానర్ లో సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి ఓ కోర్ట్ రూమ్ డ్రామా హల్చల్ చేసింది. ఈ కథ అఘాయిత్యానికి గురైన ఒక అమ్మాయి కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో బాధితురాలిగా నటించిన అర్చనా జోయిస్ పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. లాయర్ పాత్రలో అజయ్ రావు మైండ్ బ్లాక్ డిఫెన్స్ చేశాడు. ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2025లో పవన్ భట్ దర్శకత్వంలో విడుదలైన ఈ కన్నడ లీగల్ డ్రామా పేరు ‘యుద్ధకాండ చాప్టర్ 2’ (Yuddhakaanda Chapter 2). ఇందులో అజయ్ రావు, ఆర్చనా జోయిస్, ప్రకాష్ బెలవాడి, టి.ఎస్. నాగభారణ లీడ్ రోల్స్ లో నటించారు. 1 గంట 55 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది. 2025 ఏప్రిల్ 18న కన్నడ సినిమాల్లో రిలీజ్ అయిన ఈ సినిమా, 2025 జూన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది హిందీ, తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక చిన్న ఊరులో భరత్ హనుమంత్ అనే హోటల్ క్యాషియర్ ఉంటాడు. అతనికి లా పాషన్ ఉంది, కానీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల లా స్టడీస్ వదిలేసి జాబ్ చేస్తున్నాడు. ఒక రోజు సీనియర్ లాయర్ అతన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. చిన్న లా ఫర్మ్‌లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. భరత్ కూడా ఒక అడుగు ముందుకేసి లాయర్ అవుతాడు. అతనికి మొదటి సారిగా ఒక పెద్ద క్రిటికల్ కేస్ వస్తుంది. నివేదిత అనే ఒంటరి మహిళ తన కుమార్తెను లైంగికంగా వేధించిన ఒక యువకుడిని చంపుతుంది. ఆమె తరపున ఎవరూ వాదించడానికి ముందుకు రారు. ఆమెకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రముఖ న్యాయవాది రాబర్ట్ డిసౌజా కేసు తీసుకుంటాడు.

Read Also : ప్రేమలో పడే చెవిటి పూజారి… హెయిర్ స్టైల్ తోనే నవ్వు తెప్పిస్తున్న హీరో… ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ

Advertisement

ఇప్పుడు అతనితో పోరాడి బాధితురాలికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు భరత్ హనుమంత్. ఇదే సమయంలో నివేదిత హస్బెండ్ మీడియా ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుంటాడు. ఆమె కేస్ ను భరత్ తీసుకుంటాడు. భరత్ కోర్ట్‌లో వాదనల ద్వారా సొసైటీ జడ్జ్‌మెంట్‌పై క్వశ్చన్ చేస్తాడు. కోర్ట్ ట్రయల్‌లో భరత్ ఎవిడెన్స్ ప్రెజెంట్ చేస్తాడు. రాబర్ట్ డిసౌజాతో ధీటుగా వాదనలు వినిపిస్తాడు. చివరికి ఈ తల్లీకూతుర్ల కేసులో జస్టిస్ దొరుకుతుందా ? భరత్ హనుమంత్ ఈ కేసును ఎలా డీల్ చేస్తాడు ? అనే విషయాలను, ఈ కన్నడ లీగల్ డ్రామా మూవీని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×