E-Paper
Advertisement

AI Fake Train Tickets: ఏఐ సాయంతో నకిలీ ట్రైన్ టికెట్స్ తయారు.. ముగ్గురు అరెస్ట్

AI Fake Train Tickets: ఏఐ సాయంతో నకిలీ ట్రైన్ టికెట్స్ తయారు.. ముగ్గురు అరెస్ట్
Advertisement

AI Fake Train Tickets| నకిటీ ట్రైన్ టికెట్స్‌తో ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ ట్రైన్ టికెట్లు AI సాయంతో రూపొందించినట్లు సమాచారం. ఈ నకిలీ టికెట్లు అసలైన టికెట్లలాగే ఉండడం ఆశ్చర్యకరం. కానీ సాధారణ చెకింగ్‌లో రైల్వే అధికారులు వీరిని పట్టుకున్నారు.

టికెట్ చెకింగ్‌లో ఎలా గుర్తించారు

టికెట్ ఇన్‌స్పెక్టర్ రొటీన్ చెకింగ్ చేస్తుండగా ముగ్గురు ప్రయాణికులను ఆపి వారి టికెట్లను చూశారు. వీరిలో ఇద్దరు యువకులు, ఒక యువతి ఉన్నారు. వీళ్లు మొబైల్‌లో డిజిటల్ టికెట్లు చూపించారు. కానీ ఆ టికెట్లను టికెట్ ఇన్‌స్పెక్టర్ అఫీషియల్ UTS యాప్‌లో చెక్ చేయగా అందులో కనిపించలేదు. దీంతో అధికారికి అనుమానం కలిగింది.

ఒకే నంబర్ ఉండటంతో బయటపడిన మోసం

Advertisement

ముగ్గురి టికెట్లపై ఒకే నంబర్ – XOOJHN4569 – ఉండటం గమనించారు. నిజమైన UTS టికెట్లకు ప్రతి ఒక్కటికీ వేర్వేరు నంబర్లు వస్తాయి. ఒకే నంబర్ ముగ్గురికీ రావడం అసాధ్యం. ఇది స్పష్టమైన నకిలీ ఆధారం అయింది.

మొబైల్ నంబర్లు చెక్ చేయగా తెలిసిన షాకింగ్ విషయం
ప్రయాణికులు ఇచ్చిన మొబైల్ నంబర్లను రైల్వే అధికారులు తనిఖీ చేశారు. ఏ నంబర్‌కూ సీజన్ టికెట్ లేదా ఏదైనా అసలు టికెట్ రిజిస్టర్ కాలేదు. అంటే ముగ్గురూ టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారని నిర్ధారణ అయింది.

ముంబై కుర్లా స్టేషన్‌ లో అరెస్ట్

Advertisement

అధికారులు ఈ ముగ్గురు లోకల్ ట్రైన్ ప్రయాణికులను ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ రైల్వే పోలీసులకు అప్పగించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్ట ప్రకారం.. మోసం, నకిలీ ఎలక్ట్రానిక్ రికార్డు తయారు చేయడం, టికెట్ లేకుండా ప్రయాణం చేయడం అనే మూడు నేరాల కింద కేసలు నమోదయ్యాయి.

అరెస్టు అయిన వారి పేర్లు

నీరజ్ తల్రెజా, ఆథర్వ భాగ్, ఆదితి మంగళూర్కర్ (ఇద్దరు యువకులు, ఒక అమ్మాయి. వీళ్లే AI ఇమేజ్ జనరేటర్ యాప్స్ ఉపయోగించి నకిలీ టికెట్లు తయారు చేసినట్టు అధికారుల అనుమానిస్తున్నారు. వీరితో పాటు ఏదైనా గ్యాంగ్ ఉందా అని విచారణ కూడా చేస్తున్నారు.

రైల్వే హెచ్చరిక

ఈ ఘటన తర్వాత భారతీయ రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది:

టికెట్లు కేవలం అఫీషియల్ వెబ్‌సైట్ లేదా UTS యాప్ నుంచి మాత్రమే కొనండి.
స్టేషన్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ నుంచి టికెట్ కొనుగోలు చేయడం సురక్షితం.
మొబైల్ ఫోన్ లో స్క్రీన్‌షాట్ టికెట్లను నమ్మొద్దు.
ఇలాంటి మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని.. మీరు కొనుగోలు చేసిన అసలైన టికెట్ కేవలం రైల్వే అధికారులకు మాత్రమే చూపించాలని సూచించింది.

Also Read: 50 మీటర్ల చీకటిలో కూడా క్లియర్ ఫోటోలు తీసే మిలిటరీ ఫోన్.. 12GB ర్యామ్, 20,000mAh బ్యాటరీ ఫీచర్లు

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×