E-Paper
Advertisement

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!

సంగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్.. కమిటీలను ప్రకటించిన జగ్గారెడ్డి!
Advertisement

Jagga Reddy: స్వేచ్ఛ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామక సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, ఐఎన్‌టీయూసీ, కాంగ్రెస్ కిసాన్ సెల్‌తో పాటు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల కమిటీలను సైతం ప్రకటించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీకి పదవులు వచ్చిన వారు, రాని వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో పదవులు రాని వారు ఎలాంటి నిరాశకు గురికావద్దని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్తను తాను గుర్తిస్తానని జగ్గారెడ్డి అన్నారు. అందరూ కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Also read: వింత వింత జంతువులతో క్రేజీ అడ్వెంచర్… తెలుగులోనే ఈ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ధమాకా

అధికారులతో సమీక్ష సమావేశాలు

Advertisement

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై త్వరలో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన గెలిచిన, ఓడిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో అధికారుల సమక్షంలో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.అదేవిధంగా రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులతోనూ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించి, ప్రతి ఒక్కరితో వన్‌టు‌వన్‌గా మాట్లాడతానని చెప్పారు.

అధికారులను కూడా పిలిచి..

ఈ సమావేశాలకు పోలీసు శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కూడా పిలిచి ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

Advertisement

Also read: భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

Tags

Related News

సిటీలో స్వచ్ఛమైన నీటిలో గణేష్ నిమజ్జనం చేయాలనుకుంటున్నారా.. అయితే ఇక్కడికి రండి?

తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి పెంపు అప్డేట్.. సీఎం హమీ?

విధులకు రాకుండానే జీతాలు డ్రా.. కనుకులగిద్దే పల్లె దవాఖానలో అక్రమ డిప్యూటేషన్ దందా!

ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే మేలు.. తాటికొండ రాజయ్య సంచలనం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!

Big Stories

Advertisement
×