E-Paper
Advertisement

Trilogy Movies OTT : త్రిబుల్ ఎంటర్టైన్మెంట్… హర్రర్ నుంచి అదిరిపోయే యాక్షన్ వరకు ఓటీటీలో ఉన్న ట్రయాలజీ మూవీస్

Trilogy Movies OTT : త్రిబుల్ ఎంటర్టైన్మెంట్… హర్రర్ నుంచి అదిరిపోయే యాక్షన్ వరకు ఓటీటీలో ఉన్న ట్రయాలజీ మూవీస్

Trilogy Movies OTT : హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ట్రయాలజీలు చాలా ఉన్నాయి. ఒక్కో సినిమా నుంచి ఫ్రాంచైజీగా వచ్చిన ప్రతి భాగం కొత్త కథను, ఎమోషన్స్‌ను అందించి సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఫ్రాంచైజీలు ఫ్యాన్స్‌ను ఏళ్ల తరబడి ఆకట్టుకుంటున్నాయి. ఈ త్రయాలు హాలీవుడ్ హిస్టరీలో మైలురాళ్లు అని చెప్పవచ్చు. ఎపిక్ అడ్వెంచర్ నుంచి రొమాన్స్, హారర్ వరకు ఇప్పటిదాకా వచ్చిన టాప్ ట్రయాలజీలు, అవి ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

1. స్టార్ వార్స్ ఒరిజినల్ ట్రయాలజీ (A New Hope, The Empire Strikes Back, Return of the Jedi)

జార్జ్ లూకాస్ సృష్టించిన ఈ ఫ్రాంచైజీ సైన్స్ ఫిక్షన్ జానర్‌ను రీడిఫైన్ చేసింది. ల్యూక్ స్కైవాకర్, ప్రిన్సెస్ లీయా, హాన్ సోలో జర్నీ, గెలాక్సీని ఈవిల్ ఎంపైర్ నుంచి కాపాడటం. గుడ్ vs ఈవిల్, ఫ్యామిలీ సీక్రెట్స్, ఎపిక్ బ్యాటిల్స్‌తో నిండి ఉంటుంది ఈ ట్రయాలజీ. ప్రతి భాగం కొత్త ట్విస్ట్స్, ఐకానిక్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటుంది. Jio Hotstarలో కంప్లీట్ ట్రయాలజీ అందుబాటులో ఉంది.

2. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ (The Fellowship of the Ring, The Two Towers, The Return of the King)

పీటర్ జాక్సన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ ఫాంటసీ ట్రయాలజీ టాల్కీన్ నవలల ఆధారంగా తెరకెక్కాయి. ఫ్రోడో బ్యాగ్గిన్స్ జర్నీ, ఒక పవర్‌ఫుల్ రింగ్‌ను డిస్ట్రాయ్ చేయడం. హాబిట్స్, ఎల్వ్స్, డ్వార్ఫ్స్, మానవుల మధ్య ఫ్రెండ్‌షిప్, మంచి vs చెడు యుద్ధం. విజువల్స్, బ్యాటిల్స్, ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. 17 ఆస్కార్స్ గెలిచిన ఈ ట్రయాలజీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

3. బిఫోర్ ట్రైలజీ (Before Sunrise, Before Sunset, Before Midnight)

రిచర్డ్ లింక్‌లేటర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామా ట్రయాలజీలో జెస్సీ (ఇథాన్ హాక్), సెలిన్ (జూలీ డెల్పీ) మధ్య నడిచే ప్రేమ కథ… కాలం, పరిస్థితులతో ఎలా మారుతుందో చూపిస్తుంది. ఈ హార్ట్ టచింగ్ మూవీ Netflixలో అందుబాటులో ఉంది.

4. ది డార్క్ నైట్ ట్రైలజీ (Batman Begins, The Dark Knight, The Dark Knight Rises)

క్రిస్టోఫర్ నోలన్ మాస్టర్‌పీస్ ఈ ట్రయాలజీ. క్రిస్టియన్ బేల్ బ్యాట్‌ మ్యాన్‌గా, గోథమ్ సిటీని క్రైమ్ నుంచి కాపాడటం మన సూపర్ హీరో పని. జోకర్ (హీత్ లెడ్జర్), బేన్ విలన్స్‌తో ఇంటెన్స్ బ్యాటిల్స్, సైకలాజికల్ డెప్త్, యాక్షన్, థీమ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక ట్రయాలజీక్ ఉదా జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీలలో ఉంది.

5. ఈవిల్ డెడ్ ట్రయాలజీ(Evil Dead, Evil Dead Rise, Evil Dead Burn)

సామ్ రైమీ స్టైల్ ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ లో నెక్రోనామికాన్ బుక్ వల్ల డెమాన్స్ రిలీజ్ అవుతాయి. డార్క్ హ్యూమర్, ఇంటెన్స్ హారర్ మిక్స్ తో భయపెడుతుంది ఈ ఫ్రాంచైజీ. కంప్లీట్ ట్రయాలజీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది.

6. నైవ్స్ అవుట్ ట్రయాలజీ (Knives Out, Glass Onion, Wake Up Dead Man)

రియాన్ జాన్సన్ డైరెక్ట్ చేసిన మర్డర్ మిస్టరీ కామెడీ ఇది. బెనోయిట్ బ్లాంక్ (డేనియల్ క్రెయిగ్) డిటెక్టివ్‌గా వేర్వేరు కేసులు సాల్వ్ చేస్తాడు. ఈ ఫ్రాంచైజీలో లేటెస్ట్ గా విడుదలైన Wake Up Dead Man కూడా హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఫ్రాంచైజీని చూడవచ్చు.

Read Also :  ఏం సినిమా మావా… కనికరం లేని ఊచకోత… అదరగొట్టే అమ్మాయి యాక్షన్ అడ్వెంచర్

Related News

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

ఓటీటీలోకి 7,000 కోట్ల మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×