E-Paper
Advertisement

Mahabubnagar: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!

Mahabubnagar: ఎంత పని చేశావ్ చిన్నా.. పతంగి కొనివ్వలేదని చీరతో ఉరేసుకున్న బాలుడు!
Advertisement

Mahabubnagar:  మహబూబ్‌నగర్ జిల్లా చిల్వేరు గ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. గాలిపటం కొనివ్వలేదన్న చిన్నపాటి కారణం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేవలం 9 ఏళ్ల ప్రాయంలోనే సిద్ధార్థ అనే బాలుడు తనువు చాలించడం ఆ కుటుంబంలోనే కాక..  మొత్తం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో ఇలాంటి విపత్తు సంభవించడం అందరినీ కలచివేస్తోంది.

స్థానికుల సమాచారం  ప్రకారం.. రెండో తరగతి చదువుతున్న సిద్ధార్థ్ (సిద్దూ).. సంక్రాంతి పండుగ వస్తుండటంతో తనకు పతంగి కొనివ్వమని తల్లిదండ్రులు రాజు, శ్రీలతలను కోరాడు. అయితే..  వారు నిరాకరించడంతో ఆ బాలుడు మనస్థాపానికి గురయ్యాడు. సాధారణంగా పిల్లలు అలిగినట్లుగానే సిద్ధార్థ్ కూడా కోపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తల్లిదండ్రులను భయపెట్టాలనే ఉద్దేశంతో..  ఇంట్లోని స్లాబ్ వెంటిలేటర్‌కు ఉన్న చీరతో ఉరివేసుకున్నట్లు నటించబోయాడు.

Advertisement

అయితే..  ఆ ప్రయత్నంలో ఊహించని విధంగా చీర మెడకు బిగుసుకుపోయింది. ఊపిరాడక విలవిల్లాడుతున్న సిద్ధార్థ్‌ను గమనించిన తండ్రి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికే  కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తన కొడుకు ఎప్పటిలాగే కోపంతో అలిగాడని భావించిన తండ్రికి..  నిర్జీవంగా పడి ఉన్న కుమారుడిని చూసి గుండె పగిలినంత పనైంది.

ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. సిద్ధార్థ్ తల్లి శ్రీలతకు వారం రోజుల క్రితమే గర్భసంచి ఆపరేషన్ జరగడంతో ఆమె మంచానికే పరిమితమైంది. కదలలేని స్థితిలో ఉన్న తల్లి కళ్లముందే కన్నకొడుకు ప్రాణాలు పోవడం చూసి ఆమె రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. గాలిపటం కోసం మొదలైన చిన్న గొడవ..  ఒక చిన్నారి ప్రాణాలను తీయడమే కాకుండా ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Advertisement

ALSO READ: Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×