E-Paper
Advertisement

Anchor Suicide: న్యూస్ రూమ్‌లో యాంకర్ డెడ్ బాడీ.. అక్కడ దొరికిన పేపర్‌ లో ఏం రాసి ఉందంటే?

Anchor Suicide: న్యూస్ రూమ్‌లో యాంకర్ డెడ్ బాడీ.. అక్కడ దొరికిన పేపర్‌ లో ఏం రాసి ఉందంటే?
Advertisement

Anchor Suspicious Death: రోజూ పదుల సంఖ్యలో వార్తలు చదివిన ఓ యాంకర్.. ఒక రోజు తన వార్త మరో యాంకర్ చదవాల్సి వస్తుందని బహుశ ఆమె ఊహించి ఉండదు. ఎప్పటి లాగే ఆఫీస్ కు వెళ్లిన సదరు యాంకర్.. వెనక్కి తీసుకోలేని నిర్ణయం తీసుకుంది. నా అన్న వారిని విడిచి వెళ్లిపోవాలని కఠిన ఆలోచన చేసింది. తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ముందు తన ప్రాణం చాలా చిన్నదిగా భావించింది. తన బాధను పేపర్ మీద అక్షరాలుగా పేర్చింది. తనను కని పెంచిన అమ్మనాన్నలను తోబుట్టులను, బంధు మిత్రులను ఓసారి గుర్తు చేసుకుంది. సీన్ కట్ చేస్తే.. న్యూస్ రూమ్ లోనే సీలింగ్ ఫ్యాన్ కు శవమై వేలాడింది. ఆఫీస్ సిబ్బంది ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు.

ఇంతకీ అసలు ఏం జరిగింది?          

అస్సాంలోని గౌహతిలో ఈ ఘటన జరిగింది. మహిళా యాంకర్ న్యూస్ రూమ్ లో ఉరేసుకుని చనిపోయింది. ఆమె చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసిపెట్టింది. కొన్ని వారాల్లోనే పెట్టి పీటలు ఎక్కాల్సి ఉండగా, ఇంతలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం కావచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఆ యాంకర్‌ను రీతుమోని రాయ్(27) గా గుర్తించారు.  గౌహతి నగరంలోని క్రిస్టియన్ బస్తీ ప్రాంతంలోని స్థానిక న్యూస్ పోర్టల్‌ లో పని చేస్తుంది. డిసెంబర్ 5న ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తనువును చాలించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement

Read Also: లిప్‌స్టిక్ కిల్లర్ కేస్.. డ్రైనేజీలో చిన్నారి శరీర భాగాలు, మరో ఇద్దరు హత్య.. ఆ కుర్రాడే చంపాడా?

సూసైడ్ నోట్ లో ఏం రాసి ఉందంటే?

యాంకర్ రీతూ ఆత్మహత్య విషయం తెలియడంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు, సూసైడ్ నోట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఫోరెన్సిక్ టీమ్ పరిశీలించింది. పోస్ట్‌ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ దర్యాప్తు పూర్తయిన తర్వాతే మరణానికి కారణం స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ లో తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేసింది. “అందరి సంతోషం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను లేకపోతే అందరూ హ్యాపీగా ఉండవచ్చు. అందరినీ విడిచి వెళ్తున్నందుకు క్షమించండి” అని  రితుమోని లేఖలో రాసింది. రితిమోని ఆత్మహత్య మీడియా ఇండస్ట్రీలో మానసిక ఒత్తిడి గురించి ఆందోళన కలిగిస్తుంది. ఆమె తన మిత్రులతో కూడా చాలా కలివిడిగా ఉండేదని, కష్టపడి పని చేసేదని గుర్తు చేసుకున్నారు. త్వరలో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుందోనని కంటతడి పెట్టారు.

Advertisement

Read Also: లిప్‌స్టిక్ కిల్లర్ కేస్.. డ్రైనేజీలో చిన్నారి శరీర భాగాలు, మరో ఇద్దరు హత్య.. ఆ కుర్రాడే చంపాడా?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×