OTT Movie : ప్రేమ, ఫ్రెండ్‌షిప్ ల మధ్య సాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఓటీటీలో టాప్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ కథ 1920-30ల మధ్యలో యూరప్‌లో ఫన్నీ మూమెంట్స్ తో మొదలై, ఒక ఎమోషనల్ ఎండింగ్ తో ముగుస్తుంది. రియాలిటీ కి దగ్గరగా ఉండే ఈ సిరీస్ ని ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు కజిన్ సిస్టర్స్ చుట్టూ తిరిగే ఈ కథ హర్ట్ ని టచ్ చేస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది పర్సూట్ ఆఫ్ లవ్’ (The pursuit of love) 2021లో వచ్చిన బ్రిటిష్ రొమాంటిక్ మినీ సిరీస్. దీన్ని ఎమిలీ మార్టిమర్ డైరెక్ట్ చేశారు. ఇది 1945లో నాన్సీ మిట్‌ఫోర్డ్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో లిండా రాడ్లెట్ (లిలీ జేమ్స్), ఫ్యానీ లాగన్ (ఎమిలీ బీచం) ప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం 3 ఎపిసోడ్‌లతో, ఒక్కో ఎపిసోడ్ 45 నుంచి 60 నిమిషాల నిడివి ఉంటుంది. ఇది 2021 జూలై 29న BBC One, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. ఇది IMDb లో 6.7/10 రేటింగ్ పొందింది.
ఈ కథ1920లో ఇంగ్లండ్‌లోని ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. లిండా రాడ్లెట్, ఫ్యానీ లాగన్ అనే కజిన్స్, చాలా క్లోజ్ గా ఉంటారు. వాళ్లిద్దరూ ఒక పెద్ద ఇంట్లో పెరిగారు. అక్కడ లిండా చాలా బో*ల్డ్, ఫన్నీ గా ఉంటుంది. ఎప్పుడూ లవ్ స్టోరీలపై డ్రీమ్ లో ఉంటుంది. ఆమెకు అడ్వెంచర్స్, ఫ్రీ లైఫ్ కావాలి. కానీ ఫ్యానీ దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె సాంప్రదాయంగా ఉండే, సెటిల్డ్ లైఫ్ కోరుకుంటుంది. లిండా తన ఫ్యామిలీ నుండి, ముఖ్యంగా తన శాడిస్ట్ తండ్రి నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఇక వయసొచ్చాక వాళ్లిద్దరూ పెళ్లి, ప్రేమ కోసం ఎదురుచూస్తారు. లిండా మొదట ఒక రిచ్ బ్యాంకర్‌ను పెళ్లి చేసుకుంటుంది. కానీ అతను చాలా బోరింగ్ గా ఉంటాడు. ఆమె అతనితో ఏ మాత్రం హ్యాపీగా ఉండదు. తొందరగానే విడాకులు కూడా తీసుకుంటుంది. ఫ్యానీ కూడా ఒక సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుంటుంది. ఆమె లైఫ్ స్టెడీగా సాగుతుంది.
ఈ టైమ్‌లో వాళ్ల ఫ్రెండ్‌షిప్ టెస్ట్ అవుతుంది. లిండా వైల్డ్ రన్ అవుతుంది, ఫ్యానీ సేఫ్ జోన్‌లో ఉంటుంది. ఇప్పుడు లిండా తన బోరింగ్ హస్బెండ్‌తో విడిపోతుంది. పారిస్‌లో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుంది. పారిస్‌లో ఫాబ్రిస్ అనే ఫ్రెంచ్ గైతో ప్రేమలో పడుతుంది. అతను చాలా రొమాంటిక్, లిండాకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఆమె ఈ ప్రేమతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అది కూడా లాంగ్ టైమ్ స్టే అవ్వదు. ఫ్యానీ ఇంగ్లండ్‌లో పెళ్లి చేసుకుని, పిల్లలతో సెటిల్ అవుతుంది. ఆమె లిండా వైల్డ్ లైఫ్‌కు జెలస్ అవుతుంది. 1930ల్లో వరల్డ్ వార్ 2 మొదలవుతుంది, యూరప్‌లో టెన్షన్స్ పెరుగుతాయి. లిండా యూరప్‌లో ట్రావెల్ చేస్తూ, కొత్త ప్రేమలో పడుతుంది. కానీ ఆమె లైఫ్ ఇంకా గందరగోళంగానే ఉంటుంది. ఫ్యానీ లిండాను సపోర్ట్ చేస్తూనే, తన లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. వాళ్ల మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుంది.
ఈ సమయంలో వరల్డ్ వార్ 2 మరింత గట్టిగా మారుతుంది. లిండా మరో మిస్టీరియస్ ఫ్రెంచ్‌మ్యాన్‌తో అఫైర్‌లో పడుతుంది. అది ఆమె లైఫ్‌ను డేంజర్‌లో పెడుతుంది. ఆమెకు పిల్లలు కలిగినా, ప్రేమ మాత్రం దొరకదు. ఫ్యానీ ఇంగ్లండ్‌లో సేఫ్‌గా ఉంటూ, లిండా గురించి వర్రీ అవుతుంది. వాళ్లు ఒకరి లైఫ్ స్టైల్‌ను మరొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. లిండా ఫ్రీడమ్ కోసం, ఫ్యానీ స్టెడీ లైఫ్ కోసం ఫైట్ చేస్తారు. చివర్లో లిండాకి తాను అనుకున్న ప్రేమను పొందుతుందా ? ఫ్యానీ లైఫ్ సవ్యంగా సాగుతుందా ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా