BigTV English

OTT Movie : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

OTT Movie : ఫ్యామిలీని వెంటాడే శాపం… ఆ సమయంలో చావు మరింత భయంకరం… ఇదెక్కడి క్రేజీ స్టోరీ మావా

OTT Movie : ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో, మూఢనమ్మకాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. వీటినే పట్టుకుని బాయిలో కప్పల్లా వేలాడుతూ ఉన్నారు. ఎంతగా వీటి మీద చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా, అది కొంత వరకే ఫలితం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠీ నుంచి వచ్చిన ‘పంచక్’ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ కథ పంచక్ ఘడియల్లో ఎవరైనా చనిపోతే, ఆ కుటుంబంలో మరో నలుగురు త్వరలోనే చనిపోతారనే మూఢ నమ్మకం మొదలవుతుంది. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ కథ కామెడీతో పాటు ఆడియన్స్ ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘పంచక్’ (Panchak) 2023లో వచ్చిన మరాఠీ కామెడీ సినిమా. రాహుల్ అవటే, జయంత్ జాథార్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అదినాథ్ కొతారే (అర్జున్), దీప్తి దేవి (స్వప్న), భారతి అచ్రేకర్ (అమ్మ), సతీష్ అలేకర్ (పెద్దాయన), తేజశ్రీ ప్రధాన్ (సీమా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరీ 5న పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2024 జనవరీ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. 2 గంటల 8 నిమిషాల నిడివితో, IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, ZEE5
లో అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

ఖోట్ ఫ్యామిలీ ముంబైలో ఒక మిడిల్ క్లాస్ ఏరియాలో నవశిస్తుంటుంది. ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉంటారు. ఆ ఇంటి పెద్దాయన చాలా మూఢనమ్మకాలు ఫాలో అవుతుంటాడు. అతను ‘పంచక్’ గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. పంచక్ అంటే ఐదు నక్షత్రాలు ఒక లైన్‌లో ఉన్నప్పుడు వచ్చే అశుభ కాలం అన్న మాట. ఈ టైమ్‌లో ఒకరు చనిపోతే, ఒక సంవత్సరంలో ఫ్యామిలీలో మరో నలుగురు చనిపోతారని నమ్మకం. ఒక రోజు ఈ ఇంట్లో పెద్దాయన అనారోగ్యంతో చనిపోతాడు. ఆ టైమ్ పంచక్‌లోనే ఉంటుంది. ఇది తెలిసి ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ఆ పెద్దాయన భారతి కొడుకు అర్జున్, కోడలు సీమాతో పాటు కూతురు స్వప్నని కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. జ్యోతిష్యులు కూడా వాళ్లకు జాగ్రత్తలు చెబుతారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో నలుగురు డేంజర్‌లో ఉంటారు. ఇక కథ టెన్షన్, మూఢనమ్మకాల భయంతో ఫన్నీగా, ఎమోషనల్‌గా స్టార్ట్ అవుతుంది.


ఖోట్ ఫ్యామిలీ పంచక్ భయంతో రోజూ టెన్షన్‌లో ఉంటుంది. అమ్మ భారతి అచ్రేకర్ ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లకూడదని, మెడిసిన్స్ తాగకూడదని, రిస్కీ పనులు చేయకూడదని చెబుతుంది. అర్జున్ భార్య సీమా, ఈ నమ్మకాలను ఫాలో చేస్తుంది. కానీ స్వప్న కొంచెం మోడరన్‌గా ఉంటుంది. అయితే అర్జున్ సైన్స్ పై ఎక్కువగా నమ్మకం ఉండటంతో, పంచక్ అనేది మూఢనమ్మకం అని, సైన్స్‌తో దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ ఫ్యామిలీలో ఫన్నీ సిచుయేషన్స్ వస్తాయి. ఒకరు ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి భయపడతారు, మరొకరు ఆఫీస్ జాబ్ వదిలేస్తారు, ఇంకొకరు మెడిసిన్ మానేస్తారు. ఈ సమయంలో జ్యోతిష్యులు వచ్చి “పూజలు చేయండి, జాగ్రత్త” అని ఫ్యామిలీని మరింత భయపెడతారు. అర్జున్ సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్‌తో వాళ్లను ఓదార్చడానికి ట్రై చేస్తాడు, కానీ ఫ్యామిలీలో టెన్షన్ పెరుగుతుంది.

పంచక్ భయం వల్ల ఫ్యామిలీలో మరింత ఇబ్బందులు పెరుగుతాయి. అయితే అర్జున్ సైన్స్ బుక్స్, లాజిక్‌తో పంచక్ అనేది మూఢనమ్మకమని ఫ్యామిలీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అతను ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చూపించి, నక్షత్రాలు మన లైఫ్‌ని కంట్రోల్ చేయవు, మనం జాగ్రత్తగా ఉంటే సేఫ్ అని కన్విన్స్ చేస్తాడు. చివరికి ఈ ఫ్యామిలీ అర్జున్ మాటలు వింటుందా ? పంచక్ భయం నిజమవుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పెళ్లి రోజే మొగుడికి మస్కా… వేరొకరితో భార్య శోభనం… బుర్ర పాడు చేసే సినిమా

Related News

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

OTT Movie: అయ్యయ్యో ఈ లవ్ స్టోరీ మామూలుగా లేదే… ఎంట్రీనే ఊర మాస్… క్లైమాక్స్ ఊహించలేం

OTTMovie: బ్లాక్ మ్యాజిక్ తో దద్దరిల్లిన బాక్స్ ఆఫీస్… దేవుడనుకుని దెయ్యానికి పూజలు… ట్రైలర్ కే ప్యాంట్ తడిపించే సినిమా

Mirai On OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన మిరాయ్.. అధికారిక ప్రకటన!

Little hearts: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా.. ఆ జాబితాలో చోటు!

OTT Movie : ఈ నలుగురు కుర్రాళ్ళు అరాచకం భయ్యా… అన్నీ అవే సీన్లు… ఇంత ఓపెన్ గా ఎలా భయ్యా ?

Big Stories

×