E-Paper
Advertisement

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!
Advertisement

Scooter AC: సమ్మర్ సీజన్ ఎండింగ్ కి వచ్చినా సూరి మామ ఎక్కడా తగ్గట్లేదు సరికదా మరింత నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.మరీ ముఖ్యంగా ఈ మండే ఎండల్లో బైకులపై ప్రయాణించే టూవీలర్ రైడర్ల కష్టాలు మాములుగా ఉండవు.

ఎంత కవర్ చేసుకున్నా, హెల్మెట్లు పెట్టుకున్నా ఆ వేడి సెగలకు ఒళ్లు కాలిపోవాల్సిందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ సామాన్య యువకుడి బుర్రలో అద్భుతమైన ఐడియా మెరిసింది. ఈ ఎండలకి విరుగుడుగా కేవలం 1500 నుంచి 1600 రూపాయల బడ్జెట్‌తో తన నడుస్తున్న స్కూటర్‌ను ఏకంగా మొబైల్ ఏసీగా మార్చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు.

Advertisement

‘ఎవాపొరేటివ్ కూలింగ్’ టెక్నాలజీ

Advertisement

మహారాష్ట్రలోని మాలెగావ్‌కు చెందిన ఒక యువకుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ఇన్నోవేషన్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సైన్స్ పరిభాషలో దీనిని ‘ఎవాపొరేటివ్ కూలింగ్’ టెక్నాలజీగా పిలుస్తారు. ఆ యువకుడు తన స్కూటర్ ముందు భాగంలో ఒక చిన్న నీటి బాటిల్, ఒక చిన్న మోటార్ పంప్, దానికి సంబంధించిన వైరింగ్, ప్రత్యేకమైన నాజిల్ సెటప్‌ను అమర్చాడు. బైక్ స్టార్ట్ చేసి రైడింగ్ మొదలుపెట్టగానే ఈ చిన్న పంప్ యాక్టివేట్ అవుతుంది.

also read :మళ్లీ ‘బాలయ్య వర్సెస్ నాగ్’.. 2027 సంక్రాంతి రేసులో మైండ్ బ్లోయింగ్ క్లాష్!

నాజిల్స్ ద్వారా అత్యంత సన్నని నీటి చుక్కలు (మిస్ట్) స్ప్రే అవుతుంటాయి. బైక్ స్పీడ్‌గా ముందుకు వెళ్తున్నప్పుడు, ఎదురుగా వచ్చే గాలి ఈ నీటి బిందువులతో కలిసి ప్రయాణికుడి శరీరానికి తగులుతుంది. దీనివల్ల చుట్టూ 45 డిగ్రీల ఎండ ఉన్నప్పటికీ, బైక్ నడిపే వ్యక్తికి మాత్రం ఏదో లగ్జరీ ఏసీ రూమ్‌లో కూర్చుని ప్రయాణిస్తున్నంత చల్లని అనుభూతి కలుగుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజమైన టాలెంట్ అంటే మన దేశంలోని సామాన్యుల దగ్గరే ఉంటుందని, ఇలాంటి అద్భుతమైన ఐడియాకు వెంటనే పేటెంట్ రైట్స్ తీసుకోవాలంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఇన్నోవేషన్ చూడటానికి ఎంతో ఉపశమనంగా, అద్భుతంగా అనిపించినప్పటికీ, దీని వెనుక కొన్ని భద్రతాపరమైన ముప్పులు కూడా పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బైక్ అదుపు తప్పే అవకాశాలు 

స్కూటర్ ఒరిజినల్ వైరింగ్‌లో ఎలాంటి చిన్న తేడా వచ్చినా షార్ట్ సర్క్యూట్ అయి వాహనం పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ నీటి బిందువులు నేరుగా కళ్లల్లో పడితే చూపు మసకబారి బైక్ అదుపు తప్పే అవకాశాలు కూడా లేకపోలేదు.

also read :జూన్ 19న వరల్డ్‌వైడ్ రిలీజ్.. తెలుగులో ‘బాలన్ ది బాయ్’ థియేట్రికల్ హక్కులు ఎవరివంటే?

ఈ మే నెల చివరి వారంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరడంతో, జనం ఇలాంటి వినూత్న ప్రయోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. థియేటర్లలో ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ సినిమాలు చూసే రోజుల్లో, రోడ్డుపై వెళ్లే టూవీలర్‌కే ఏసీ తగిలించుకున్న ఈ కుర్రాడి తెలివికి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రమాదాల ముప్పు ఉన్నప్పటికీ, ఈ మండే ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి సామాన్యులు చేస్తున్న ఇలాంటి క్రేజీ ప్రయత్నాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×