E-Paper
Advertisement

KTR: ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రే.. ఇదంతా ఒక నాటకం: కేటీఆర్

KTR: ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రే.. ఇదంతా ఒక నాటకం: కేటీఆర్
Advertisement

KTR: స్వేఛ్చ బ్యూరో: నిన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరోపించారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్, దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వలన అనేక దుర్మార్గాలను తెలంగాణ గత రెండు సంవత్సరాలుగా చవిచూస్తున్నదని, అలాంటి వరుస సంఘటనల్లో భాగంగానే తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ కేసులోని ఆధారాలన్నింటినీ భద్రపరిచిన ఫోరెన్సిక్ లాబొరేటరీని కుట్రపూరితంగా ఆధారాలన్నీ ధ్వంసం చేసేటట్టు అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు అన్నారు. కేవలం మూడు అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదాన్ని, మొదటి అంతస్తులో ఉన్న అగ్నికీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టిందీ అంటే ఇంతకు మించి కుట్ర అనడానికి వేరే విషయం అవసరం లేదు అన్నారు.

11 సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసు..

ఈ ప్రమాదం జరిగిన తీరు పైన కేటీఆర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి 10 సంవత్సరాల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనే అని కేటీఆర్ అన్నారు. 11 సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసు కొనసాగుతున్నదని, అది ప్రస్తుతం చివరి దశలో ఉన్నదని, అందులో నుంచి బయటపడడానికే ఈ అగ్ని ప్రమాదం నాటకం, కుట్ర అని కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో బీజేపీతో అంటకాగుతున్న కొంతమంది వ్యక్తుల సూచన మేరకు, ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ని రేవంత్ రెడ్డి తగలబెట్టించాడన్న అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అందుకే పూర్తిగా బిల్డింగ్‌లో ఉన్న సాక్ష్యాధారాలతో పాటు రికార్డులను, కంప్యూటర్లను, చివరికి సర్వర్లను నిర్విఘ్నంగా మూడున్నర గంటల పాటు దగ్ధం చేశారని కేటీఆర్ అన్నారు. మెత్తం 50 కంప్యూటర్లను, సర్వర్లను దగ్దం చేశారన్నారు.

సాక్ష్యాధారాలు ఉన్న కార్యాలయం..

Advertisement

ఈ ఘటనలో వేలాది ఘోరమైన నేరాలకు సంబంధించి, నేరస్తులకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా దగ్ధమయ్యాయని, దీనితో వారు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ప్రమాదంలో పెద్దగా నష్టం జరగలేదని చెప్పిన ప్రభుత్వం, ఈరోజు ఎఫ్ఐఆర్ లో మాత్రం పూర్తిగా సాక్ష్యాధారాలు ఉన్న కార్యాలయం దగ్ధమైందని… సాక్ష్యాధారాలు ఉన్న రూం దగ్ధమైందని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో చీకటి దొంగ ఒక్కటైనట్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు అయినందున ఈ విషయం ఒక కుట్రపూరిత యాక్సిడెంట్‌గా భావిస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్రంతో లాలూచీ పడి తన అవినీతిని, అక్రమాలను కప్పి పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి, ఈ ఓటుకు నోటు కేసు విషయంలో కూడా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారన్నారు.

Also Read: Wildlife Accidents: అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం.. నెక్ట్స్ ప్లాన్ ఇదే..?

కేటీఆర్ డిమాండ్..

Advertisement

ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్ళు పట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ విషయం న్యాయస్థానంలో ఉంది కాబట్టి, శిక్ష పడే అవకాశం ఉన్నది కాబట్టే తన చావు తెలివితేటలతో సాక్ష్యాధారాలు మాయం చేసే ఒక డెడ్లీ కుట్రకు తెరలేపిండని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకొని నిజానిజాలు బయటకి తీయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి అనే ఛోటా భాయ్‌ని బడే భాయ్ కాపాడడం లేదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని, బీజేపీ-రేవంత్ రెడ్డి మధ్య లాలూచీ లేకుంటే వెంటనే కేంద్రం తన ఉన్నత విచారణ సంస్థలతో ఈ అంశంలో స్పష్టమైన విచారణ చేయాలన్నారు.

కుటుంబ బావమరుదుల ప్రైవేట్ ఆర్మీ..

దీనితో పాటు ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసి ఈ అంశాన్ని నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి సవాలు విసిరారు. మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం పైన తమకు నమ్మకం లేదని, అనేక మంది పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీగా వ్యవహరిస్తున్నారని, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి, డీజీపీకి దమ్ముంటే నిజానిజాలను బయటపెట్టాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థను తన ప్రైవేట్ సైన్యం, ఆర్మీ లాగా ముఖ్యమంత్రి వాడుకుంటూ భూముల సెటిల్మెంట్ల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి కుటుంబ బావమరుదుల ప్రైవేట్ ఆర్మీ లాగా పోలీసులు వ్యవహరిస్తూ వారి ద్వారా చేస్తున్న అరాచకాలు తెలంగాణ అందరికీ తెలుసు అన్నారు. స్వయంగా ఒక మంత్రి కొండా సురేఖ అనుచరుడి విషయంలో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిత్ రెడ్డి గన్ పెట్టి, తలకు తుపాకీ పెట్టి 300 కోట్ల రూపాయలను బెదిరించిన పోలీసులు ఇలాంటి కేసు నమోదు చేయలేదని, మరోవైపు ట్యాపింగ్ పేరుతో సోషల్ మీడియా కేసుల పేరుతో ప్రతిపక్షాలను, పార్టీ వివిధ పార్టీల నేతలను, ప్రజలను వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

హెచ్‌యూ భూముల్లో..

కానీ పోలీసు యంత్రాంగం ఏదో దాయడం కోసమే అత్యంత రహస్యంగా ఎవరినో కాపాడే ప్రయత్నంలో భాగంగానే పూర్తి వివరాలు బయటపెట్టడం లేదన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల బృందం ప్రమాద స్థలానికి వస్తామని, అక్కడి విషయాలను సైంటిస్టులతో మాకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే బీజేపీ-రేవంత్ రెడ్డి బడే భాయ్-ఛోటా భాయ్ అనుబంధం బలంగా ఉన్నదని, అందుకే స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణలు చేసినా, ఇప్పటిదాకా సుప్రీంకోర్టు చెప్పినా హెచ్‌యూ భూముల్లో ఇప్పటిదాకా ఎలాంటి ఎంక్వైరీ జరగలేదన్నారు. మొన్నటికి మొన్న సింగరేణి కుంభకోణం బయటపెట్టినా కేంద్రం కనీసం పట్టించుకోలేదన్నారు. అందుకే రేవంత్ రెడ్డి వెనకాల, ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం వెనకాల ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొంతమంది హస్తం ఉన్నదని, వారికి ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్నదని, వారి ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఈ ప్రమాదమనే కుట్రకు తెరలేపిండా అనే విషయం స్పష్టం చేయాలన్నారు. అందుకే రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయని కేటీఆర్ అన్నారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×