E-Paper
Advertisement

వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో విషాదం.. ఆర్మీ జవాన్ ఆత్మహత్య
Advertisement

Army Soldier Dies: పండుగ వేళ ఆ ఇంట్లో నవ్వులు విరియాలి.. కానీ, ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని ముంచెత్తింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ అందరికీ అండగా నిలిచే ఒక జవాన్, కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోయారు. వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సెలవుల్లో ఇంటికి వచ్చి..

Advertisement

యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (28) ఆర్మీలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొద్ది రోజుల కిందటే సెలవుపై ఊరికి వచ్చారు. నిన్నటివరకు భార్య, బంధువులతో ఎంతో సంతోషంగా గడిపారు. ఇంట్లో అందరితో సరదాగా మాట్లాడిన మల్లేశం, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

ఎనిమిది నెలల క్రితమే పెళ్లి

Advertisement

ఉదయాన్నే విగతజీవిగా పడి ఉన్న మల్లేశంను చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. కేవలం ఎనిమిది నెలల క్రితమే ఆయనకు వివాహమైందని బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్త ఇలా అర్థాంతరంగా దూరమవడంతో ఆ నవవధువు రోదనలు వర్ణనాతీతంగా మారాయి.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు. పండుగ పూట దేశ రక్షణలో ఉండే జవాన్ ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలుముకున్నాయి.

Also Read: ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదు: పవన్ కల్యాణ్

Tags

Related News

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు!

తెలంగాణ పల్లెల్లో మళ్లీ మోగనున్న డప్పు చాటింపులు.. ఎందుకో తెలుసా..?

హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. మూడు నెలల కిందట వివాహం, అసలు కారణమేంటంటే..

అలియాబాద్‌లో విషాదం.. చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి

మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసు.. నేపాల్ లో నిందితురాలు, రేపో మాపో హైదరాబాద్‌కు!

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

Big Stories

Advertisement
×