BigTV English
Advertisement

OTT Movie : అపరిచితుడి రాకతో వల్లకాడుగా మారే ఊరు… బ్లాక్ మ్యాజిక్ తో దడ పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : అపరిచితుడి రాకతో వల్లకాడుగా మారే ఊరు… బ్లాక్ మ్యాజిక్ తో దడ పుట్టించే హర్రర్ సీన్స్

OTT Movie : జాంబీ సినిమాలు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా జాంబీ, దెయ్యం, షమనిజం, హారర్ వంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. దీని అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నటన, క్లైమాక్స్ తో దక్షిణ కొరియా హారర్ సినిమాలలో ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచింది. ఈ చిత్రం గోక్సియాంగ్ అనే గ్రామంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

2016లో విడుదలైన “ది వైలింగ్” (The Wailing) అనే కొరియన్ హారర్-మిస్టరీ మూవీకి నా హాంగ్-జిన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో క్వాక్ డో-వోన్, హ్వాంగ్ జంగ్-మిన్, చున్ వూ-హీ, జున్ కునిమురా నటించారు. 156 నిమిషాల నిడివితో, ఈ చిత్రం అతీంద్రియ హారర్, థ్రిల్లర్, డిటెక్టివ్ డ్రామా వంటి అంశాలనుతో తెరకెక్కింది. IMDb లో 8.1/10 స్కోర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా జియో హాట్ స్టార్, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

దక్షిణ కొరియాలో ఉన్న గోక్సియాంగ్ అనే ఒక చిన్న కొండ ప్రాంతంలో ఉండే గ్రామంలోకి, ఒక జపనీస్ వ్యక్తి రాకతో అక్కడ పరిస్థితి మారిపోతుంది. ఆ గ్రామంలో ఒక వింత రోగం వ్యాపిస్తుంది. ఇది గ్రామస్తులను హింసాత్మకంగా మార్చి, వారి కుటుంబాలను వాళ్ళే దారుణంగా చంపేటట్లు చేస్తుంది. ఈ రోగం బారిన పడిన వాళ్ళు ఒంటి పై దద్దుర్లు, మానసిక అస్థిరతతో జంతువులా ప్రవర్తిస్తుంటారు. మొదట ఇది జాంబీ-లాంటి వ్యాధిగా అనిపిస్తుంది. స్థానిక పోలీసు అధికారి జోంగ్-గూ, ఒక డిటెక్టివ్ కలసి ఈ సంఘటనలమీద దర్యాప్తు చేస్తారు. అతని దర్యాప్తు గ్రామంలోని మూఢనమ్మకాలు, జపనీస్ వ్యక్తిపై అనుమానాలతో ముందుకెళ్తుంది.

గ్రామస్తులు ఆ జపనీస్ వ్యక్తిని ఒక దెయ్యంగా భావిస్తారు. జోంగ్-గూ ఒక రోజు రాత్రి మూ-మ్యాంగ్ అనే యువతిని కలుస్తాడు. ఆమె ఈ దారుణాలకు ఆ జపనీస్ వ్యక్తే కారణమని చెప్తుంది. ఆమె ఈ గ్రామ రక్షకురాలిగా ఉంటుంది. ఇంతలో జోంగ్-గూ కుమార్తె హ్యో-జిన్ కూడా ఈ అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం ప్రారంభిస్తుంది. ఆమెను రక్షించడానికి జోంగ్-గూ, ఇల్-గ్వాంగ్ అనే ఒక షమన్ సహాయం తీసుకుంటాడు. ఇల్-గ్వాంగ్ ఒక శక్తివంతమైన ఆచారం నిర్వహిస్తాడు. ఇది అతీంద్రియ శక్తులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. కానీ ఈ ఆచారం హ్యో-జిన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. జోంగ్-గూ, అతని సహచరులు జపనీస్ వ్యక్తిని హింసాత్మకంగా ఎదుర్కొంటారు. ఒక రాక్షస రూపంలో అతని నిజస్వరూపం బయటపడుతుందని అంతా భావిస్తారు. కానీ క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? ఆ జపనీస్ వ్యక్తి ఎవరు ? గ్రామంలో జరుగుతున్న సంఘటనలకు కారణం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : క్లాస్ రూమ్ లోనే పాడు పని… టీచర్ పనిష్మెంట్ తో ఊహించని మలుపు… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

Related News

Jio Hotstar : జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ మూవీస్.. టాప్ 5 సినిమాలు ఇవే..

OTT Movie : కంటికి కన్పించని అమ్మాయితో ఆ పని… ఇంత ఓపెన్ గా ఎలారా అయ్యా ? ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయిలను చంపే సైకో … బ్లైండ్ లేడీ ఇన్వెస్టిగేషన్ … మిస్ అవ్వకుండా చూడాల్సిన తమిళ్ థ్రిల్లర్

OTT Movie : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న తోపు కే-డ్రామాలు… IMDb లో 8.5 కంటే ఎక్కువ రేటింగ్‌… ఇందులో మీరెన్ని చూశారు ?

OTT Movie : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్

Big Stories

×