Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒక్కో సినిమాతో టాలెంట్ ను నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్ అయ్యింది. సినిమాల విషయంలో చాలా తక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సమంతపై వార్తలొస్తున్నప్పటికీ అవి ఆమె సినిమాలకు సంబంధించినవి కాకుండా తన పర్సనల్ విషయాల గురించే ఎక్కువగా వస్తున్నాయి. డైరెక్టర్ తో రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నా సామ్ లైట్ తీసుకుంది. తాజాగా ఈ అమ్మడు కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. వివరాలల్లోకి వెళితే..
సామ్ కొత్త బిజినెస్ ఇదే..?
హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్, నిర్మాతగా వరుసగా సినిమాలు చేసింది. అలాగే పలు బ్రాండ్లకు ఎంబాసిడర్ గా వ్యవహారిస్తుంది. పెద్ద సినిమాల్లో నటించక పోవడమే కాకుండా ఎలాంటి పెద్ద ప్రాజెక్టునీ అనౌన్స్ కూడా చేయలేదు. దీంతో సమంత తర్వాతి ప్రాజెక్టు ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి ఎంటరవుతున్నారని సమాచారం. అదే లగ్జరీ పెర్‌ఫ్యూమ్.. అవును సమంత బిజినెస్ లోకి అడుగుపెట్టింది.. లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చడానికి సమంత ప్రయత్నిస్తున్నారని సమంత సన్నిహిత వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వరకు ప్రతీ దానిలో సమంత ఇన్వాల్వ్ అవుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో ఆమె క్రేజ్ ను పెంచుకుంటుంది.
సినిమాల విషయానికొస్తే..
సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మయోసైటిస్ వల్ల సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు తన కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని దానికి తగ్గ కథలనే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు కానీ ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్ లు ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాలకు ఎంత గ్యాప్ తీసుకున్నా కూడా ఆమె స్థానం అలాగే ఉంటుంది. రెండు ప్రాజెక్టులకు సంతకం పెట్టిందని సమాచారం. త్వరలోనే వాటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అటు బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తుంది. అంతేకాదు ఈ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనె ఆ న్యూస్ కూడా వింటావేమో చూడాలి.. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Also Read: శనివారం స్పెషల్ మూవీస్..అబ్బా పునకాలు పక్కా..!
డైరెక్టర్ తో ప్రేమాయణం..
సమంత స్టార్ హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య ప్రొడ్యూసర్ గా మారింది.. ఆమె నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన మొదటి మూవీ శుభం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా కొత్త సినిమాలకు సైన్ చేస్తుంది. డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.