BigTV English

OTT Movie : 43 మంది మహిళలు ప్రెగ్నెంట్… ఒకే రోజు గర్భం దాల్చి, పిల్లలకు జన్మనిచ్చే తల్లులు… లాస్ట్ ట్విస్ట్ వేరే లెవెల్

OTT Movie : 43 మంది మహిళలు ప్రెగ్నెంట్… ఒకే రోజు గర్భం దాల్చి, పిల్లలకు జన్మనిచ్చే తల్లులు… లాస్ట్ ట్విస్ట్ వేరే లెవెల్

OTT Movie : సరికొత్త స్టోరీలతో వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఒక సూపర్‌ హీరో సిరీస్ ప్రేక్షకులను బుల్లితెరకు అతుక్కుపోయేలా చేస్తోంది. ఇది డిస్ఫంక్షనల్ కుటుంబ డైనమిక్స్, టైమ్ ట్రావెల్, అపోకలిప్టిక్ థ్రిల్స్‌ తో తెరకెక్కింది. ఈ సిరీస్ సూపర్‌హీరో జానర్ అభిమానులు, తప్పక చూడవలసిన సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది అంబ్రెల్లా అకాడమీ’ (The Umbrella Academy) జెరార్డ్ వే, గాబ్రియెల్ బా రాసిన డార్క్ హార్స్ కామిక్స్ సిరీస్ ఆధారంగా స్టీవ్ బ్లాక్మాన్ సృష్టించిన అమెరికన్ సైన్స్-ఫిక్షన్ సూపర్‌హీరో టెలివిజన్ సిరీస్. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 2019 ఫిబ్రవరి 15న మొదటి సీజన్‌తో ప్రారంభమైంది. 2025 నాటికి నాలుగు సీజన్లు విడుదలయ్యాయి. ఇది 10 ఎపిసోడ్‌లను కలిగి ఉంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 45-60 నిమిషాల రన్ టైమ్ ఉంటుంది. ఈ సిరీస్‌లో ఎలియట్ పేజ్, టామ్ హాపర్, డేవిడ్ కాస్టానెడా, ఎమ్మీ రావర్-లాంప్‌మన్, రాబర్ట్ షీహాన్, ఎయిడన్ గల్లాఘర్, జస్టిన్ హెచ్. మిన్ నటించారు. IMDbలో ఈ సిరీస్ కి 7.9/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ1989లో ప్రారంభమవుతుంది. ఇక్కడ 43 మంది మహిళలు అసాధారణంగా, ఒకే రోజున గర్భవతిగా ఉన్నట్లు తెలియకుండానే పిల్లలను కనడం జరుగుతుంది. వీరిలో ఏడుగురు పిల్లలను సర్ రెజినాల్డ్ హార్గ్రీవ్స్ అనే ఒక బిలియనీర్ దత్తత తీసుకుంటాడు. వారికి సూపర్‌హీరోలుగా శిక్షణ ఇస్తాడు. వారిని ‘ది అంబ్రెల్లా అకాడమీ’ గా ఏర్పాటు చేస్తాడు. ఈ ఏడుగురు పిల్లలు అసాధారణ శక్తులను కలిగి ఉంటారు. వారికి హార్గ్రీవ్స్ నంబర్లు ఇస్తాడు: లూథర్/నంబర్ వన్, డియాగో/నంబర్ టూ, అల్లిసన్/నంబర్ త్రీ , క్లాస్/నంబర్ ఫోర్, ఫైవ్/నంబర్ ఫైవ్, బెన్/నంబర్ సిక్స్, వాన్య/నంబర్ సెవెన్. 2019లో హార్గ్రీవ్స్ మరణం తర్వాత, చెల్లాచెదురైన ఈ సోదరీసోదరులు అతని అంత్యక్రియల కోసం తిరిగి కలుస్తారు. వీళ్ళ బాల్యం కఠినమైన శిక్షణ, హార్గ్రీవ్స్ వైఖరి వల్ల ఒకరికొకరు దూరం చేసింది.

ఇప్పుడు లూథర్ ఒక బలమైన నాయకుడు, డియాగో ఒక ఫైటర్, అల్లిసన్ ఒక ప్రసిద్ధ నటి, క్లాస్ ఒక డ్రగ్ అడిక్ట్, ఫైవ్ ఒక టైమ్-ట్రావెలర్, వాన్య తనకు శక్తులు లేవని భావిస్తుంది. నెంబర్ ఫైవ్, భవిష్యత్తు నుండి తిరిగి వచ్చి, ఎనిమిది రోజుల్లో అపోకలిప్స్ జరగబోతుందని అన్తదరిని హెచ్చరిస్తాడు. దానిని ఆపడానికి సోదరీ, సోదరులు ఒకచోట చేరి పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయంలో వీళ్ళు ఒక రహస్యమైన సంస్థ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లంతా తమ శక్తులను ఉపయోగించి, అపోకలిప్స్‌ను ఆపడానికి పోరాడుతారు. సీజన్ ఒక షాకింగ్ రివీల్‌తో ముగుస్తుంది. ‘ది అంబ్రెల్లా అకాడమీ’ ప్రపంచానికి రాబోతున్న విపత్తును ఆపగలుగుతుందా ? ఆ విపత్తు ఎలాంటిది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : అమ్మాయిలను బుక్ చేసుకుని, టార్చర్ చేసి చంపేసే సైకో… వర్త్ వాచింగ్ రియల్ కొరియన్ కథ

Related News

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

Big Stories

×