OTT Movie : అందాల తార శ్రీదేవి ఆకాశంలో ఒక నక్షత్రంలా కనిపిస్తూనే ఉంటుంది. ఈమె నటించిన చివరి సినిమా ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ చిత్రం శ్రీదేవి నటించిన 300వ సినిమా. అంతే కాకుండా, ఆమె 2018లో మరణించడంతో ఇది ఆమె చివరి సినిమాగా నిలిచింది. ఇది ఒక స్టెప్‌మదర్ తన సవతి కుమార్తెపై జరిగిన అఘాయిత్యంపై ప్రతీకారం తీర్చుకునే ఒక ఉత్కంఠభరిత కథ. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
2017 లో వచ్చిన ఈ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మామ్’ (Mom). ఈ సినిమాకి రవి ఉదయవార్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీదేవి, సజల్ అలీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, ఆద్నాన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా 2017 జూలై 7 న హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ₹175.7 కోట్లు వసూలు చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2 గంటల 26 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.
స్టోరీ లోకి వెళితే
దేవకి సభర్వాల్ (శ్రీదేవి) న్యూ ఢిల్లీలోని ఒక పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె సవతి కుమార్తె ఆర్య (సజల్ అలీ) కూడా అదే పాఠశాలలో చదువుతుంటుంది. దేవకి తన భర్త ఆనంద్ (ఆద్నాన్ సిద్ధిఖీ), వారి కుమార్తె ప్రియాతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతుంది. కానీ ఆర్యతో ఆమె సంబంధం ఒడిదొడుకులతో నడుస్తూ ఉంటుంది. ఆర్య తన సవతి తల్లిని ‘మామ్’ అని పిలవడానికి ఇష్టపడక, మేడమ్’ అని పిలుస్తుంటుంది. ఎందుకంటే ఆమె తన సొంత తల్లిని ఇప్పటికీ కోల్పోయిన బాధలోనే ఉంటుంది.
ఒక రోజు ఆర్య తన స్నేహితులతో ఒక ఫామ్‌హౌస్ పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆమె సహవిద్యార్థి మోహిత్ (ఆదర్శ్ గౌరవ్) ఆమెను డాన్స్‌కు ఆహ్వానిస్తాడు. కానీ ఆమె అతన్ని తిరస్కరిస్తుంది. దీనితో కోపంతో, మోహిత్, అతని స్నేహితుడు చార్లెస్, చార్లెస్ డ్రైవర్ జగన్, సెక్యూరిటీ గార్డ్ బాబూరామ్ పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు ఆర్యను కిడ్నాప్ చేస్తారు. వీళ్ళు ఆమెపై ఒక కదులుతున్న SUVలో దారుణమైన అఘాయిత్యానికి పాల్పడతారు. ఆ తరువాత ఆమెను ఒక గట్టర్‌లో విసిరివేస్తారు. ఈ ఘటన ఆర్యను శారీరకంగా, మానసికంగా కోలుకోలేకుండా చేస్తుంది. దేవకి, ఆనంద్ ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తారు.
కోర్టులో వీళ్లకు కనీస న్యాయం కూడా జరగదు. ఆధారాలు సరిపోకపోవడంతో నలుగురు నిందితులు విడుదలవుతారు. ఈ అన్యాయాన్ని సహించలేని దేవకి, తన సవతి కుమార్తెకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఒక గాడ్-ఫియరింగ్ ప్రైవేట్ డిటెక్టివ్ డీకే (నవాజుద్దీన్ సిద్ధిఖీ) సహాయంతో నలుగురు నేరస్థులను ఒక్కొక్కరినీ లక్ష్యంగా చేసుకుంటుంది. ఇన్స్‌పెక్టర్ మాథ్యూ (అక్షయ్ ఖన్నా) ఈ కేసును దర్యాప్తు చేస్తూ, దేవకి చర్యలపై అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ ఆమె తెలివిగా ఆధారాలను నాశనం చేస్తూ తన ప్రతీకార ప్రణాళికను కొనసాగిస్తుంది. చివరికి నిందితులను దేవకి శిక్షిస్తుందా ? ఆర్య మామూలు స్థితికి వస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భార్యను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… బతికుండగానే భర్తకు చుక్కలు చూపించే ఆడ దెయ్యం