E-Paper
Advertisement

OTT Movie : గుండె తరుక్కుపోయేలా చేసే బెస్ట్ లవ్ స్టోరీలు… ఈ వీకెండ్ కు డోంట్ మిస్

OTT Movie : గుండె తరుక్కుపోయేలా చేసే బెస్ట్ లవ్ స్టోరీలు… ఈ వీకెండ్ కు డోంట్ మిస్
Advertisement

OTT Movie : ఈ వీకెండ్ ఏమి చూడాలి అని ఆలోచిస్తున్నారా? మామూలు లవ్ స్టోరీలతో విసిగిపోయారా ? అయితే మీకోసమే కొన్ని అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి. లవ్ అంటే గ్లామర్, డ్యూయెట్స్, కిస్సులు మాత్రమే కాదు… జీవితంలో వచ్చే చిన్న చిన్న సంతోషాలు, బాధలు కలిగిన కథలు కూడా ఉంటాయి. అలాంటి మనసును తడిమే, కళ్ళను చెమర్చే సినిమాలు ఇక్కడ ఐదు ఉన్నాయి. ఇవన్నీ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అశ్లీలత అంటూ ఏమాత్రం లేకుండా, ప్రేమ బంధాల గురించి మాత్రం చూపిస్తూ గుండెల్ని పిండేస్తాయి. లైఫ్ లో ఒక్క సారైనా చూడాల్సిన ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి వివరాలేంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

 1. ‘Christy’ (2023)

ఈ మలయాళం మూవీలో ఒక ఒంటరి మహిళ (మాలవికా మోహనన్) తన బిడ్డతో బ్రతుకుతూ… ప్లస్ టూ ట్యూషన్ తీసుకునే యువకుడు రాయ్ (మాథ్యూ థోమస్)తో బంధం ఏర్పరుచుకుంటుంది. ఈ సినిమాలో ఇది ప్రధాన అంశంగా ఉంటుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కాదు. రెండు ఒంటరి గుండెల మధ్య ఏర్పడే అపారమైన అభిమానం గురించిన కథ. ఇందులో ఎక్కడా రొమాన్స్ లేదు, ఎక్కడా డ్రామా లేదు… కానీ సినిమ ముగిసిన తర్వాత మీ గుండెలో ఒక మధురమైన జ్ఞాపకం మిగిలిపోతుంది. ఇందులో మాలవికా మోహనన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది SonyLIV లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. ‘Colour Photo’ (2020)

Advertisement

90s నేపథ్యంలో వచ్చిన ఈ తెలుగు సినిమా, ఒక నల్ల రంగు చర్మం ఉన్న యువకుడు (సుహాస్), అతని కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయి (చందినీ చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత వీళ్ళ మధ్య కులం, రంగు, అంతస్తు ఒక అడ్డు గోడలుగా నిలుస్తాయి. కానీ వాళ్ళ ప్రేమ మాత్రం అత్యంత అందంగా పరిమళిస్తుంది. సుహాస్ యాక్టింగ్, సంతోష్ నారాయణన్ సంగీతం… ప్రతి ఫ్రేమ్ మనసుకు హత్తుకుంటుంది. లాస్ట్ 30 నిమిషాల ఈ సినిమాని చూస్తే మాత్రం, కళ్ళలో నీళ్ళు ఆపుకోవడం కష్టంగానే ఉంటుంది. Aha ఓటీటీలో ఇది అందుబాటులో ఉంది.

3. Dil Bechara (2020)

ఇది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సారిగా నటించిన బాలీవుడ్ సినిమా. చెప్పాలంటే పూర్తిగా ఒక ఇండియన్ ఎమోషన్ సినిమా. క్యాన్సర్‌తో బ్రతుకుతున్న కిజీ (సంజనా సంఘి), మన్నీ (సుశాంత్) మధ్య ఏర్పడే స్నేహం, ప్రేమ, జీవితం పట్ల ఆశ… అంతా అద్భుతంగా చూపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకి మరింత హైప్ తెచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత జీవితాన్ని మరింత అందంగా చూడాలనిపిస్తుంది. జియో హాట్ స్టార్ లో ఇది స్ట్రీమింగ్ లో ఉంది.

4. ‘Joe (2023) 

Advertisement

జో అనే ఒక యువకుడు, తన కాలేజీ లవ్ ను పెళ్ళి చేసుకోవాలని కలలు కంటాడు. కానీ జీవితం వేరే మలుపు తిరుగుతుంది. ఈ సినిమలో రొమాన్స్ ఒక భాగమే, ఎక్కడా ఫోర్స్డ్ ఎమోషన్స్ లేవు, ఎక్కడా లౌడ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ లేదు. కానీ మీరు థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు, లేదా టీవీ ఆఫ్ చేసేటప్పుడు గొంతులో మాటలు ఆగిపోతాయి. ఇది నిజంగా ఒక ‘సైలెంట్ కిల్లర్’ లాంటి సినిమా. ఈ తమిళ మూవీ జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

5. Thanga Meengal (2013)

రామ్ డైరెక్ట్ చేసిన ఈ మాస్టర్‌పీస్, ఒక తండ్రి కూతురు మధ్య అపారమైన ప్రేమ కథతో నడుస్తుంది. ఈ ప్రేమ కూడా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఒక మధ్యతరగతి తండ్రి, తన ఆరేళ్ళ కూతురు చదువు కోసం ఎంతలా కష్టపడతాడు, ఎంతలా త్యాగం చేస్తాడనేది కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా ఉంటాయి.ఈ తమిళ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ ఐదు సినిమాలు చూస్తే, ఖాళీగా ఉన్న గుండెల్లో ఒక ఎమోషన్ నిండుగా ఉంటుంది.

 

Read Also : స్విమ్మింగ్ పూల్ లో దెయ్యం… ఓటీటీలోకి వచ్చేసిన 485 కోట్ల హర్రర్ థ్రిల్లర్

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×