E-Paper
Advertisement

Top 20 News Today: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట, టీచర్‌గా మారిన కలెక్టర్

Top 20 News Today: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట, టీచర్‌గా మారిన కలెక్టర్

1. సీఎం విషెస్

చుక్కా రామయ్య శత వసంత జన్మదినోత్సవం సందర్భంగా ఎక్స్‌‌లో ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అద్భుత విద్యా బోధనతో యువత భవితకు బంగారు బాటలు వేసి ఐఐటీ రామయ్యగా పేరుగాంచి, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. మేధావి చుక్కా రామయ్యకి శత వసంత జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి.

2. చంద్రబాబు భేటీ

బిహార్‌ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ను చంద్రబాబు, లోకేష్ కలిశారు.

3. రామయ్యతో హరీష్ రావు

నూరు వసంతాలు పూర్తి చేసుకున్న ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యని మాజీ మంత్రి హరీష్ రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామయ్య సేవలు వెలకట్టలేనివని, సమాజానికి ఎంతో మంది ఇంజనీర్లను అందించారని హరీష్ రావు కొనియాడారు.

4. మాలవత్ పూర్ణ కుటుంబాన్ని మంత్రి పరామర్శ

ఎవరెస్ట్ శిఖరాన్ని అతి చిన్న వయసులో అధిరోహించిన మాలవత్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి సీతక్క. ఇటీవల మాలావత్ పూర్ణ తండ్రి మరణించగా.. ఎమ్మెల్యే భూపతిరెడ్డిలతో కలిసి నిజాంబాద్ జిల్లాలోని పూర్ణ నివాసానికి చేరుకున్న మంత్రి సీతక్క ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు మంత్రి సీతక్క.

5. జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని అన్నారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

6. విచారణకు సహకరించాలి

కేటీఆర్ నిజాయితీపరుడైతే విచారణకు సహకరించాలన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి. కేటీఆర్‌ను బీజేపీ, కిషన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ అరెస్ట్ ఆలస్యం కావడంలో కేంద్రం పాత్ర ఉందని, కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

7. అభివృద్ధి చేయాలంటూ డిమాండ్

సఫిల్‌గూడ చెరువును అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు మల్కాజ్‌గిరి కార్పోరేటర్‌ శ్రవణ్. ఈ చెరువును అభివృద్ధి చేయడంలేదని.. ఆ చెరువులో దూకే ప్రయత్నం చేశారు. అభివృద్ధి పనులు జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు.

8. అత్తాపూర్‌లో కవిత

అత్తాపూర్‌లో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జాగృతి జనం బాటలో భాగంగా రాజేంద్రనగర్‌లోని జలాల్ బాబా నగర్, భూపాల్ నగర్ బస్తీ వాసుల ఇండ్ల పట్టాల సమస్యపై మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు కవిత.

9. టీచర్‌గా మారిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారారు. భగాయత్ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, పదో తరగతి విద్యార్థుల గురించి స్వయంగా ఆరా తీశారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ను పిల్లలకు భోదించారు కలెక్టర్.

10. కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

తెలంగాణ హైకోర్టు కేటీఆర్‌కు ఊరట కలిగించింది. 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనల కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌ కేసును హైకోర్టు రద్దు చేసింది. కేసు కేటీఆర్ మరియు గోరెటి వెంకన్న పై నమోదు అయ్యింది. ఎన్నికల సమయంలో జరిగిన అనుమానాస్పద కార్యకలాపాల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌ నుండి కేసు నమోదు అయ్యింది. అయితే హైకోర్టు విచారణలో సాక్ష్యాలు తగినవిగా లేవని, క్రమపద్ధతిలో లేనందున కేసును కొట్టివేసింది. ఈ నిర్ణయం కేటీఆర్‌కు రాజకీయ పరంగా ఉపశమనం కలిగించింది.

11. జాతీయ రహదారిపై బైకర్‌ల హల్‌చల్

ఖమ్మం నేషనల్ హైవేపై యువత బైక్‌లపై రాష్ డ్రైవింగ్‌తో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏదులాపురం జాతీయ రహదారిపై కొందరు యువకులు అతివేగంగా వికృత విన్యాసాలు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

12. పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్

మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఎం డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు ఉగ్యోగులు.

13. వరంగల్ జిల్లాలో భారీ ర్యాలీ

వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా బీజేపీ శ్రేణులు సామూహిక వందేమాతర గీతాలపన నిర్వహించారు.వరంగల్ జిల్లా వర్ధన్నపేట అంబేద్కర్ కూడలిలో బీజేపీ శ్రేణులు, విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మానవహారం నిర్వహించి గీతాన్ని ఆలపించారు.

14. తప్పుడు ఆరోపణలు

వైసీపీపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు తనను పట్టించుకోవడం లేదంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదనుకోవడం వైసీపీ భ్రమేనని చెప్పారు ఆదినారాయణ.

15. వాహన తనిఖీలు

కురుపాంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎస్సై నారాయణ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారంతపు సంతలో డ్రోన్ ద్వారా పరిశీలించారు.

16. నేపాల్‌లో జెన్-జడ్ ఆందోళనలు

నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు చెలరేగాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులు, యువ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఎక్కువ మంది ఒక చోట చేరడంపై నిషేధం విధించింది.

17. సీఎంగా ప్రమాణస్వీకరం

బీహార్‌లో NDA ప్రభుత్వం కొలువుదీరింది. నితీశ్‌ కుమార్‌ పదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ ఆయనచే ప్రమాణం చేయించారు. పట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా NDA పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు.

18. ఉక్రైయిన్‌కు షాక్

ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీకి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను చడీచప్పుడు లేకుండా ఆమోదించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్ల ప్లాన్‌ సిద్ధం చేశారు ట్రంప్.

19. ఉపేంద్ర ట్విస్ట్

హీరో రామ్ పోతినేని, మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఉపేంద్ర ఆసక్తికర విషయం చెప్పారు. ‘ఆంధ్ర కింగ్’ పాత్ర తాను లేదా రామ్ పోతినేని కాదని, సినిమాలో మరో వ్యక్తి ఉన్నాడని ఉపేంద్ర ప్రకటించారు. ఈ ట్విస్ట్‌తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

20. భారత్‌కు స్వర్ణం

డెఫ్‌లింపిక్స్‌లో భారత షూటర్లు అభినవ్‌ దేశ్వాల్, ప్రాంజలి సత్తా చాటారు. 10మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో ఈ జోడీ స్వర్ణం గెలుచుకుంది. ఈ ద్వయం 16-6తో చైనీస్‌ తైపీకి చెందిన యా యు కావ్, మింగ్‌ జుయి సు జోడీపై విజయం సాధించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×