BigTV English

OTT Movie: రాత్రయితే రచ్చ చేసే అమ్మాయి… ప్రేమ పేరుతో పాడుపనులు… ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్

OTT Movie: రాత్రయితే రచ్చ చేసే అమ్మాయి… ప్రేమ పేరుతో పాడుపనులు… ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్

OTT Movie : కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయినా, ఒటిటిలో మాత్రం ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అయితే ఒక మలయాళ థ్రిల్లర్ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. దీనికి థియేటర్లలో కంటే ఒటిటిలో ఆదరణ పెరుగుతోంది. ఈ సినిమా ఒకే రాత్రిలో జరిగే కొన్ని సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మలయాళ థ్రిల్లర్ సినిమా పేరు ‘త్రయం’ (Thrayam). 2024 లో విడుదలైన ఈ సినిమాకి సంజిత్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, సన్నీ వేన్, అజు వర్గీస్, అనార్కలి మరికర్, నిరంజన్ మణియన్‌పిళ్ల రాజు, రాహుల్ మాధవ్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నాన్-లీనియర్ థ్రిల్లర్ అరుణ్ కె. గోపీనాథ్ స్క్రీన్‌ప్లే, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతంతో రూపొందింది. ఈ చిత్రం 2024 అక్టోబర్ 25న థియేటర్లలో విడుదలైంది. తర్వాత 2024 డిసెంబర్ 27 నుండి మనోరమామాక్స్, OTTplay లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ బిజీగా ఉండే కొచ్చి నగరంలో మొదలవుతుంది. కొంతమంది వ్యక్తులు అనుకోకుండా ఒక రాత్రి కలుసుకోవడంతో ఈ స్టోరీ మొదలవుతుంది.

ఎల్సా (ప్రీతి గినో): ఎల్సా అనే యువతి మగవాళ్ళను హనీట్రాప్‌లో ఇరికించి, వారి వీడియోలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజుతుంది. ఆమె ఆశిక్ (ధ్యాన్ శ్రీనివాసన్) జోకుట్టన్ (గోపీకృష్ణన్) వంటి వ్యక్తులను టార్గెట్ చేస్తుంది. అయితే ఇంతలో ఆమె కొంతమంది యువకుల తో గొడవకు దిగుతుంది. ఇది ఆమెకు ఒక విషాదకరమైన అనుభవాన్ని ఇస్తుంది. ఎల్సా తన ప్రేమికుడు జోమన్‌ను చనిపోయినట్లు తెలుసుకుంటుంది. ఇది కథలో ఒక కీలకమైన ట్విస్ట్ గా ఉంటుంది.

ఆశిక్ : ఆశిక్ ఒక చిన్న దొంగ. ఒక దుకాణాన్ని దోచడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎల్సా బ్లాక్‌మెయిల్‌కు గురవుతాడు. ఆమెకు డబ్బు ఇచ్చి ఆమె నుండి తప్పించుకోవాలని చూస్తాడు. అతని స్టోరీ ఇతర సంఘటనలతో ముడిపడుతుంది.

హ్యారీ (సన్నీ వేన్): హ్యారీ బ్లాక్ మనీని డెలివరీ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తిని కారుతో ఢీకొడతాడు. ఇది ఒక హిట్-అండ్-రన్ సంఘటనగా మారుతుంది. ఇతను కూడా ఎల్సాతో సంబంధం కలిగి ఉంటాడు. అతడు చేసే పనులవల్ల ఆ రాత్రి కొంతమంది జీవితాలు తలక్రిందులవుతాయి.

విజయ్ గ్యాంగ్ : ఈ యువకుల గ్యాంగ్ అంజలి అనే యువతిని ప్రయివేట్ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేస్తూ, డబ్బు గుంజే ప్లాన్ లో ఉంటారు. ఈ క్రమంలో ఒక హిట్-అండ్-రన్ సంఘటన జరుగుతుంది.

విన్సెంట్ (రాహుల్ మాధవ్): ఒక పోలీసు అధికారి ఒక మృతదేహాన్ని కనిపెడతాడు. ఇది ఎల్సాతో సంబంధం కలిగి ఉంటుంది. అతని పాత్ర ఈ స్టోరీలన్నిటినీ ఒకచోట చేర్చడానికి సహాయపడుతుంది.

ఈ స్టోరీ నాన్-లీనియర్ ఫార్మాట్‌లో నడుస్తుంది. కొన్ని స్టోరీలు ఒకదానితో ఒకటి లింక్ అవుతూ, ఒకే రాత్రిలో జరిగే బ్లాక్‌మెయిల్, హత్య వంటి సంఘటనలతో ఇది తిరుగుతుంది. వీళ్లంతా ఎలాంటి పనులు చేస్తారు ? ఎందువల్ల చిక్కుల్లో పడతారు ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ప్రియుడితో ఉండటానికి భర్త పర్మిషన్… కక్కుర్తితో భార్య పాడు పని… ఏంది సామీ ఈ రచ్చ

Related News

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

Big Stories

×