Brahmamudi serial today Episode: కోర్టులో అప్పు నిర్దోషి అని తేలగానే..అందరూ హ్యాపీగా ఫీలవుతారు. కళ్యాణ్, అప్పు రాజ్‌కు థాంక్స్ చెప్తారు. దీంతో రాజ్ అందరూ చెప్తున్నారు కానీ చెప్పాల్సిన వాళ్లు మాత్రం చెప్పడం లేదు అంటాడు. దీంతో కావ్య ఎందుకు చెప్పాలండి లాస్ట్‌లో నన్ను చాలా టెన్షన్ పెట్టారు. మీరు ఇంకా రాలేదని నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంటుంది కావ్య. దీంతో రాజ్ ముఖం మాడ్చుకోవడంతో కావ్య ఊరికే జోక్ చేశాను రామ్ గారు అంటుంది. ఇంతలో యామిని వచ్చి బావ కంగ్రాట్స్ బావ అని చెప్పగానే రాజ్ నవ్వుకుంటూ థాంక్స్ యామిని అంటాడు. నిజంగా నువ్వు సూపర్ బావ లాస్ట్ మినిట్‌లో ఆ సాక్ష్యం తీసుకొచ్చి అప్పును కాపాడేశావు. నువ్వే కనక లేకుండా ఉంటే అసలు అప్పు ఈ కేసు నుంచి బయట పడేదే కాదు. మరోసారి కంగ్రాచ్యులేషన్ బావ అంటుంది.
థాంక్యూ కానీ అప్పును కాపాడాను కానీ ఇంకొకటి బ్యాలెన్స్‌గా ఉంది.. అని రాజ్ చెప్పగానే.. ఏంటది బావ అని యామిని అడగ్గానే.. అప్పుకు ఇలాంటి పరిస్థితి కల్పించిన వారి గురించి తెలుసుకోలేకపోయాను కదా..? వాళ్లెవరో నాకు తెలిసి ఉంటే నా స్టైల్లో వాళ్లకు కరెక్టుగా బుద్ది చెప్పి ఉండేవాణ్ని అంటాడు. ఇంతలో కావ్య మీరేం బాధపడకండి రామ్‌గారు. అప్పుకు జాబ్ మళ్లీ తిరిగి వస్తుంది కదా..? ఇక తనే చూసుకుంటుంది. తనకు ఈ పరిస్థితి కల్పించిన వాళ్లను పట్టుకుంటుంది. వాళ్ల తుప్పు రేగ్గొడుతుంది అని చెప్పగానే అప్పు కూడా అవును అక్కా నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్లను ఎలా వదిలేస్తాను. వడ్డీతో సహా తిరిగి ఇవ్వడం అది నా బాధ్యత కదా అంటుంది. దీంతో యామిని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాజ్ కూడా వెంటనే మనం ఇంటికి వెళ్దాం పదండి అందరికీ ఈ గుడ్‌న్యూస్ చెబుదాం పదండి అంటాడు.
అందరూ రాత్రికి భోజనం చేస్తుంటే రాజ్ తినకుండా చూస్తుండిపోతాడు. ఎందుకు తినడం లేదని సుభాష్ అడగ్గానే.. కళావతి గారు నన్ను అవమానించారు అంటాడు రాజ్. నేనేం చేశాను అని కావ్య అడగ్గానే.. నాకు మీరు అన్నం కొంచెం వడ్డించారు చూడండి అంటాడు. దీంతో కావ్య రాజ్‌కు అన్నం వడ్డిస్తుంది. అందరూ హ్యపీగా ఉన్న టైంలో ధాన్యలక్ష్మీ అప్పును జాబ్ మానేయమని ఇంద్రాదేవికి చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో రాజ్, ధాన్యలక్ష్మీకి క్లాస్ తీసుకుంటాడు. అప్పు ప్లేస్ లో మీ కూతురే ఉంటే ఇలాగే ఆలోచించేవారా..? పిన్ని అంటూ అడుగుతాడు.
అయితే ఈరోజు చిన్న ప్రాబ్లమ్ కాబట్టి సరిపోయింది. కానీ రేపు ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వస్తే అది ఆలోచించే నేను వద్దన్నాను అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో మీ భయంతో తన కాళ్లకు బంధం వేయాలని చూస్తున్నారు ఒకసారి మీ భయాన్ని వదిలేసి ఆలోచించి చూడండి.. మీరు భయపడుతున్నట్టు ఏమీ కాదు పిన్ని అంటూ రాజ్ చెప్తుండగానే.. ఇంద్రాదేవి సరే వదిలేయండి అప్పు టెన్షన్‌లో పడి స్వప్న కూతురు పుట్టినరోజు గురించే మర్చిపోయాం అని చెప్పగానే అందరూ అవును ఎల్లుండే బర్తుడే చాలా గ్రాండ్ గా చేద్దాం అంటారు.
మరోవైపు యామిని కోపంగా కుర్చీని విసిరికొట్టి ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కావ్యనే గెలుస్తుంది. నా ఇంటికి వచ్చి నా చెంప పగులగొట్టిన ఆ అప్పు చేత చిప్ప కూడు తినిపించాలని ప్లాన్ చేసినా ఇప్పుడు కూడా ఆ అప్పును కాపాడి కావ్యనే గెలిచింది. వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అంటూ కోప్పడుతుంది. దీంతో రుద్రాణి ఆవేశపడకు యామిని ఎంత ఎక్కువ ఆవేశపడితే అంత అపోనెంట్‌కు ప్లస్ అవుతుంది అని చెప్తుంది. దీంతో యామిని కోపంగా అంటే ఆ కావ్యను వదిలేయమంటారా..? అని అడుగుతుంది. దీంతో రుద్రాణి అవును వదిలేయమనే చెప్తున్నాను అంటుంది.
దీంతో యామిని మరింత కోపంగా రుద్రాణి గారు మీరేం మాట్లాడుతున్నారు.. దాన్ని నేను వదిలేయడం ఏంటి..? అని అడుగుతుంది. నేను వదిలేయమంది శాశ్వతంగా కాదు యామిని టెంపరరీగా టైం మనది కానప్పుడు వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ఆ కావ్య మీద కోపంతో ఏమైనా చేశావో అనుకో అప్పు నీ మీద ఎంక్వైరీ వేస్తుంది. అప్పుడు అప్పును ఇలా ఇరికించింది నువ్వేనని.. ఆ వెనకాల ఉండి ఆడించింది నువ్వేనని అంతా రాజ్‌కు తెలిసిపోతుంది. అప్పుడు నీ ఉనికికే ప్రమాదం కదా ఒకసారి ఆలోచించు అని చెప్తుంది రుద్రాణి.
అంటే ఇప్పుడు నన్ను దాని ముందు తగ్గి బతకమంటున్నారా..? అంటుంది యామిని. తగ్గి బతకమని చెప్పడం లేదు యామిని అవసరం మనది అయినప్పుడు తగ్గినా తప్పు లేదంటున్నాను.. ఆ కావ్యను దెబ్బ కొట్టే టైం వచ్చినప్పుడు వెంటనే నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు అంటుంది రుద్రాణి. సరే ప్రస్తుతానికి మీరు చెప్పినట్టే సైలెంట్‌గా ఉంటాను అని చెప్తుంది. ఇంతలో వైదేహి వచ్చి యామినిని తిడుతుంది. రుద్రాణి వెళ్లిపోతుంది. దారిలో టాక్సీ నడుపుతున్న జగదీష్‌ను చూసి ఫాలో అవుతుంది రుద్రాణి.
రేవతి కూరగాయలు తీసుకుంటుంటే.. కొడుకు రాజ్ మళ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి అపర్ణ కారుకు డాష్ ఇస్తాడు. దీంతో కాలుకు గాయం అవుతుంది. అపర్ణ బాధగా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. దూరం నుంచి రేవతి అంతా గమనిస్తుంది. అపర్ణను అలా చూసి ఎమోషనల్ అవుతుంది. మరోవైపు జగదీష్‌ను ఫాలో అవుతున్న రుద్రాణి వెంటనే రేవతి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇంతలో రేవతి, జగదీష్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?