E-Paper
Advertisement

PM Rahat Scheme: పీఎం రహత్ పథకంలో చేరడానికి మేము సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

PM Rahat Scheme: పీఎం రహత్ పథకంలో చేరడానికి మేము సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

PM Rahat Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకువచ్చిన పీఎం రహత్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడానికి సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పీఎం రహత్ (పీఎం రహత్- ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అస్యూర్డ్ ట్రిట్ మెంట్) పై అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించడం పీఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం అన్నారు. 201 లా కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత గంట (గోల్డెన్ అవర్) లోపు బాధితుడిని ఆసుపత్రికి చేర్చితే 50% మరణాలు తగ్గించవచ్చు అన్నారు.

మరణాలు తగ్గించవచ్చు

పథకం ద్వారా ప్రతి బాధితుడికి 1.5 లక్షలు వరకు చికిత్స ఖర్చు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు ఈ కవరేజ్ వర్తిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు ఈ సహాయం అందుతుందని, ప్రాణాపాయం లేని కేసులో 24 గంటల వరకు ప్రాణాపాయ స్థితిలో 48 గంటల వరకు చికిత్స అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్ లో పొన్నం మాట్లాడుతూ పీఎం రహత్ పథకంలో చేరనున్నట్లు తెలిపారు. మరణాలు తగ్గించవచ్చని తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రవాణా శాఖలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వాహన సారధిలో చేరిందని పేర్కొన్నారు.

Advertisement

Also Read: Malayalam Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ థ్రిల్లర్… వరుస హత్యలతో వణికించే స్టోరీ

ఈవి వాహనాలను ప్రోత్సహించడం..

దేశంలో ఎక్కడా లేనివిధంగా స్క్రాప్ పాలసీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈవీ పాలసీ ద్వారా 100 టాక్స్ మినహాయింపు చేసినట్లు వివరించారు. తెలంగాణలో ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్స్ , లైసెన్సుల జారీలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఈవి వాహనాలను ప్రోత్సహించడంతో పాటు పట్టణ ప్రాంతాలు ఈవి బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,జేటీసీలు మామిండ్లచంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య,ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: అంతా ఫిక్సింగే..జింబాబ్వేకు జై షా డ‌బ్బులు..అందుకే టీమిండియా విజ‌యం, మ‌రోసారి విషం క‌క్కిన పాక్‌

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×