E-Paper
Advertisement

Kamran Akmal : PSLను కాద‌ని ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయ‌ర్ల‌ను న‌డిరోడ్డుపై ఉరి తీయాల్సిందే !

Kamran Akmal : PSLను కాద‌ని ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయ‌ర్ల‌ను న‌డిరోడ్డుపై ఉరి తీయాల్సిందే !
Advertisement

Kamran Akmal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కంటే ముందే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League Tournament) ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రమే ఈ టోర్నమెంట్ షురూ కానుంది. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు కొంతమంది విదేశీ క్రికెటర్లు గుడ్ బై చెబుతూ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయన్న కారణంతో ఐపీఎల్ లో అవకాశం వస్తే జంప్ అవుతున్నారు. అయితే అలాంటి ప్లేయర్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు చాలా సీరియస్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను కాదని ఐపిఎల్ లోకి వెళ్లే విదేశీ క్రికెటర్లను నడిరోడ్డు పైన ఉరితీయాలని బాంబు పేల్చారు. అలాంటి వాళ్లకు కట్టిన శిక్ష వేయాల్సిందేనని పేర్కొన్నారు. దీంతో కమ్రాన్ అక్మల్( Kamran Akmal ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయర్లను నడిరోడ్డు పైన ఉరితీయాలి ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటే అసూయపడే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, నిత్యం ఏదో ఒక కామెంట్ చేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. పొద్దున లేస్తే చాలు ఇండియన్ టోర్నమెంటు పైన పడిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పాకిస్తాన్ సూపర్ లీగ్ కు విలన్ గా మారింది. గాయాల కారణంగా చాలామంది ఐపీఎల్ టోర్నమెంట్ కు దూరం అవుతున్నారు. అయితే ఆ విదేశీ క్రికెటర్ల స్థానంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లు, యూటర్న్ తీసుకొని ఐపీఎల్ లోకి వెళ్లిపోతున్నారు. అలా ఇప్పటికే బ్లెస్సింగ్ ముజారాబాని, శనకా లాంటి ఆటగాళ్లు జంప్ అయ్యారు. అయితే వీళ్ళపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సీరియస్ అయి, చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకొని, ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చాలామంది ఐపిఎల్ టోర్నమెంట్ లోకి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. అలాంటి ప్లేయర్లను నడిరోడ్డు పైన ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నమ్మక ద్రోహం చేసే వాళ్లను అస్సలు వదలకూడదు అని పేర్కొన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న 9 మందికి పైగా విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ టోర్నమెంట్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. ఇలా వెళ్లడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి బదిలీలను నివారించడానికి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇలాంటి ప్లేయర్లపై నిషేధం విధిస్తే బెటర్ అన్నారు.

Advertisement

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×