E-Paper
Advertisement

Suspense Thriller OTT: అందమైన రూపం వెనుక అంతులేని ద్రోహం… నమ్మించి నట్టేట ముంచే నర్సు… గుండె బద్దలయ్యే క్లైమాక్స్

Suspense Thriller OTT: అందమైన రూపం వెనుక అంతులేని ద్రోహం… నమ్మించి నట్టేట ముంచే నర్సు… గుండె బద్దలయ్యే క్లైమాక్స్
Advertisement

Suspense Thriller OTT : కొన్ని రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు పెద్దగా బడ్జెట్ అవసరం ఉండదు. చాలా తక్కువ ఖర్చుతో సినిమా అంతా దాదాపు ఒకే ఇంట్లో తీస్తుంటారు. ఈ నేపథ్యంలో లో ఒక సినిమా చాలా తక్కువ ఖర్చుతో రూపొందింది. ఈ సినిమా కేవలం 71 నుండి 75 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా, అనవసరమైన సాగతీత లేకుండా సాగుతుంది. అయితే ఇది పెద్దలకు మాత్రమే ఉద్దేశించి తీశారు. ఇందులో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఒంటరిగా ఈ సినిమాను చూడటం మంచిది.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్

ఈ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బిట్టర్ డిజైర్’ (Bitter Desire). సైమన్ ఆలివర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నాథన్ హిల్, షార్ డీ, డయానా బెంజమిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో హీరోగా నటించిన నాథన్ హిల్ కేవలం నటుడే కాదు, ఈ సినిమాకు ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఆయన గతంలో ఇలాంటి తక్కువ బడ్జెట్ థ్రిల్లర్ సినిమాలను చాలానే తీశారు. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్టీవ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉండగా, ఒక ప్రమాదకరమైన నేరస్తుడు ఆండ్రూను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో స్టీవ్ తీవ్రంగా గాయపడి, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంటాడు. అయితే ఆండ్రూ జైలుకు వెళతాడు. అయితే కొంతకాలం మంచం మీద ఉండాల్సివస్తుంది స్టీవ్. ఇక జైలులో ఉన్న ఆండ్రూ, తనను పట్టుకున్న స్టీవ్ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం తన ప్రేమికురాలైన సాషా కు ఒక మిషన్ అప్పగిస్తాడు. సాషా, స్టీవ్‌కు చికిత్స అందించే నర్స్‌గా మారువేషంలో స్టీవ్ ఇంటికి వస్తుంది. ఆమె అసలు ఉద్దేశం స్టీవ్ జీవితాన్ని నాశనం చేయడం. అతన్ని సెడ్యూస్ చేయడం. ఇంట్లోకి వచ్చిన సాషా, డ్యూటీ పేరుతో స్టీవ్‌కు బాగా దగ్గరవ్వడానికి ట్రై చేస్తుంది. ఒంటికి మసాజ్లు చేస్తూ, తన మాయమాటలతో అతన్ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది.సాషా స్టీవ్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అనుకోకుండా ఆమె స్టీవ్‌తో నిజమైన ప్రేమలో పడుతుంది. ఈ ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో వ్యవహారం మొదలవుతుంది. చివరికి ఆ నర్సు అసలు రంగు బయటపడుతుందా? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : చావు భయంతో వణికిపోయే డ్యాన్సర్లు… అవంతిక వందనపు నటించిన హాలీవుడ్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×