RCB VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Royal Challengers Bengaluru,) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. తొడ కండరాల నొప్పితో రోహిత్ శర్మ, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కీలకమైన సమయంలో 19 పరుగులు సాధించి గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయాడు. అటు ఇదే మ్యాచ్ లో అర్థ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీకి వైరల్ ఫీవర్ సోకింది. దీంతో అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకుంది బెంగుళూరు. ఇక ఇద్దరూ స్టార్లు స్టేడియంలో లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఫీల్డింగ్ కు మాత్రం దూరంగా ఉన్నాడు. గ్రౌండ్ లో ఎప్పుడు చురుగ్గా కనిపించే విరాట్ కోహ్లీకి వైరల్ ఫీవర్ సోకింది అంటున్నారు. అందుకే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తర్వాత అతని స్థానంలో మరో ప్లేయర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నారు.
బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా తొడ కండరాలను నొప్పితో రోహిత్ శర్మ బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే 19 పరుగులు సాధించి మంచి టచ్ లోకి వచ్చిన తర్వాత, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు రోహిత్ శర్మ. దీంతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే గ్రౌండ్ లో ఇద్దరు స్టార్లు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. వాళ్ల కోసమే టికెట్లు కొని మ్యాచ్ కోసం వచ్చామని.. ఆ ఇద్దరు ప్లేయర్లు లేకపోతే కష్టమే అంటున్నారు అభిమానులు.
ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ పై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. 38 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టెస్ట్ ప్లేయర్ గా మారిపోయాడని విరాట్ కోహ్లీని నిలదీస్తున్నారు. అలాగే ఇదే మ్యాచ్ లో రెండు వైడ్ల కోసం బెంగళూరుకు అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా రివ్యూలు తీసుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముంచేసాడని ఫైర్ అవుతున్నారు.
Also Read: Tanveer Ahmed: వైభవ్ సూర్యవంశీ “ఇల్లీగల్ డ్రగ్స్” తీసుకున్నాడు, వెంటనే విచారణ చేయండి
?igsh=bWV4bzkzZHoycGV1