E-Paper
Advertisement

Thriller Movie OTT: గ్యాంగ్‌స్టర్ల నీడలో పెరిగిన గాన కోకిల… మునుపెన్నడూ చూడని వింత కథ

Thriller Movie OTT: గ్యాంగ్‌స్టర్ల నీడలో పెరిగిన గాన కోకిల… మునుపెన్నడూ చూడని వింత కథ
Advertisement

Thriller Movie OTT : థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే మజానే వేరు. అందుకే ఆడియన్స్ మొదటిగా ఈ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ఇటువంటి సినిమాలే ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ జోనర్ లో వచ్చిన ఒక రష్యన్ మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ స్టోరీ నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్స్ తో, గ్యాంగ్స్టర్ల మధ్య పెరిగే మషా అనే ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ ఉంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ రష్యన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మషా’ (Masha). అనస్తాసియా పాల్చికోవా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో చిన్నప్పటి మషా పాత్రలో పోలినా గుఖ్మాన్, పెద్ద మషాగా అన్నా చిపోవ్స్కాయా నటించారు. ఈ సినిమా 2020లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కినోటావర్’ (Kinotavr) ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం prime videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రష్యాలో ఒక సిటీలో అంతా గ్యాంగ్‌స్టర్ల రాజ్యమే ఉంటుంది. ఆ రౌడీ గ్యాంగ్‌కి లీడర్ కూడా ఉంటాడు. అతని దగ్గరే 13 ఏళ్ల మషా అనే ఆమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయి పెరుగుతుంది. ఊరంతా ఆ గ్యాంగ్‌ని చూసి వణికిపోతుంటే, మషాకి మాత్రం వాళ్ళే లోకం. ఆ రౌడీలు చేసే మర్డర్లు, దందాలు ఏవీ ఈమెకు తెలీవు. వాళ్లందరూ తనని ప్రాణంగా చూసుకునే అన్నయ్యలు, మామయ్యాలు అనుకుంటూ, తను ఒక పెద్ద సింగర్ కావాలని కలలు కంటూ వాళ్ల మధ్యే బిందాస్‌గా తిరుగుతుంటుంది.

కానీ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. తను నమ్ముతున్న ఆ మనుషులే, తన కన్నవాళ్ల జీవితాలను నాశనం చేశారని మషాకు మెల్లగా అర్థమవుతుంది. తను ఎవరినైతే తన వాళ్లు అనుకుని నమ్మిందో, వాళ్లే అసలైన విలన్లు అని తెలిశాక ఆమె లోకం తలకిందులవుతుంది. ఆ గ్యాంగ్‌స్టర్ల నీడలో బతకడం నరకం అనిపించి, ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుని మాస్కో సిటీకి పారిపోతుంది. ఆతరువాత కొన్నాళ్ళకు తన కుటుంబాన్ని బలి తీసుకున్న వాళ్లకు బుద్ధి చెప్పాలనుకుంటుంది. చివరికి మషా ఆ రౌడీ గ్యాంగ్‌కి ఎలా బుద్ది చెప్పింది ? సింగర్ కావాలనే కలను ఆమె నెరవేర్చుకుందా ? అసలు వాళ్ళు ఆమె పేరెంట్స్ ను ఎందుకు చంపారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.

Advertisement

Read Also :  2 గంటల 21 నిమిషాల ఉత్కంఠ… ‘ధురందర్’ ను మరిపించే స్పై థ్రిల్లర్… ఆస్కార్ ను గెలిచిన సినిమా

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×