E-Paper
Advertisement

GHMC Commissioner: మెయిన్ రోడ్ల శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి.. అధికారులకు కర్ణన్ కీలక సూచనలు

GHMC Commissioner: మెయిన్ రోడ్ల శానిటేషన్ పై ఫోకస్ పెట్టాలి.. అధికారులకు కర్ణన్ కీలక సూచనలు
Advertisement

GHMC Commissioner:  స్వేచ్ఛ, బ్యూరో:  జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మెయిన్ రోడ్లు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా క్లీన్ కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు ఎఫెక్టుగా నిర్వహించేలా ఫోకస్ పెట్టాలని కూడా సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన శానిటేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు ఉదయం తొమ్మినదిన్నర గంటల కల్లా మెయిన్ రోడ్లన్నీ చెత్త పూర్తిగా తొలగించి, క్లీన్ గా కన్పించాలని స్పష్టం చేశారు.

Also Read: Social media: సోషల్ మీడియాపై మోదీ సర్కార్ ఉక్కుపాదం.. ఇక నిమిషాల్లో ఫేక్ వీడియోలు డిలీట్, అదెలా అంటే..?

డీఈఈలపై చర్యలు తీసుకుంటాం

Advertisement

ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఉదయం పది గంటల తర్వాత ప్రధాన రహదారులపై క్లీనింగ్ కార్యకలాపాలు కనిపించకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శానిటేషన్ బాధ్యత ప్రధానంగా డిప్యూటీ కమిషనర్లు, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈలదేనని ఆయన స్పష్టం చేశారు. గ్రీన్ వెస్ట్ తొలగింపు బాధ్యతను కూడా ఇకపై ఎస్‌డబ్ల్యూఎం విభాగమే నిర్వహించాలని తెలిపారు.

గ్రీన్ వెస్ట్‌ను వేగం

సీఅండ్ డీ వ్యర్థాలు, దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, గ్రీన్ వెస్ట్‌ను వేగంగా తొలగించేందుకు అదనపు వాహనాలు సమకూరుస్తామని వెల్లడించారు. పారిశుద్ధ్యం పై మీడియాలో వచ్చే నెగెటీవ్ వార్తలపై క్విక్ రెస్పాన్స్, యాక్షన్ ఉండాలన్నారు. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (శానిటేషన్ ) రవికిరణ్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, మందా మకరందు, ముకుందారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈలు, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Tirumala steps: తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఆ నియమాలు తప్పకుండా పాటించాలట

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×