Thriller Series : ఓటీటీలో చూస్తే జాంబీ థ్రిల్లర్ లే చూడాలి. నిజానకి దెయ్యాల సినిమాలలో ఒక దెయ్యం భయపెడుతుంది. అయితే ఈ కంటెంట్ లో లెక్కలేనన్ని ఉంటాయి భయపెట్టడానికి. ఈ నేపథ్యంలో మనం ఒక కొరియన్ జాంబీ థ్రిల్లర్ గురించి చెప్పుకోవాలి. కరోనా లాక్‌డౌన్ తర్వాత వచ్చిన కథ కాబట్టి థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా బాగానే పండాయిఇందులో. ఇది కేవలం రక్తపాతం చూపించే మామూలు జాంబీ కథ కాదు. మనుషులు ఒకే అపార్ట్ మెంట్ లో బందీలైతే వాళ్ల అసలు రంగులు ఎలా బయటపడతాయో ఇందులో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ ఓనర్లకు, అద్దెకు ఉండేవారికి మధ్య జరిగే గొడవలు, స్వార్థం కోసం ఒకరినొకరు మోసం చేసుకోవడం వంటి అంశాలతో సమాజంలోని కుళ్లును ఎండగడతాయి. అందుకే దీన్ని హర్రర్ కంటే కూడా ఒక ‘సోషల్ క్లాస్ థ్రిల్లర్’ అని చెప్పవచ్చు. ఇది ఐయండిబిలో 7.7 టాప్ రేటింగ్ కూడా పొందింది.
2021లో వచ్చిన ఈ సూపర్ హిట్ సౌత్ కొరియన్ డ్రామా పేరు ‘హ్యాపీనెస్’ (Happiness). ఇందులో హీరో పార్క్ హ్యుంగ్-సిక్ చాలా రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ హాన్ హ్యో-జూ కూడా తన యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టింది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, ఒకరినొకరు కాపాడుకోవాలనే తపన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తం 12 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి నిమిషం ఉత్కంఠగా సాగుతుంది. Netflix (నెట్‌ఫ్లిక్స్), Rakuten Viki (రాకుటెన్ వికీ)లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతం తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులో లేదు, కేవలం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే చూడటానికి వీలుంది.
ఒక డ్రగ్ ప్రయోగం బెడిసికొట్టి కొత్త రకం వైరస్ వ్యాపిస్తుంది. అయితే ఈ వైరస్ సోకిన వాళ్ళు విచక్షణ కోల్పోయి ఇతరుల రక్తం కోసం తపిస్తారు. దీని ఎఫ్ఫెక్ట్ తో మనుషులు పిచ్చోళ్లలా అయిపోయి, పక్కనోడిని కొరికేసి రక్తం తాగేస్తుంటారు. ఇలాంటి టైమ్‌లో హీరో, హీరోయిన్ కష్టపడి ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఇల్లు సంపాదిస్తారు. హాయిగా కాపురం చేద్దామనుకునే లోపే, ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవడికో ఆ రోగం అంటుకుంటుంది. ఇంకేముంది, ప్రభుత్వం ఆ బిల్డింగ్‌ని చుట్టూ సీల్ వేసేసి ఎవ్వరినీ బయటికి రానివ్వదు. బయట రోగం ఒకెత్తయితే, ఆ బిల్డింగ్ లోపల ఉన్నోళ్ల గోల ఇంకో ఎత్తు. పై ఫ్లోర్లలో ఉండే ధనవంతులు, కింద ఉండే సామాన్యులను తక్కువ చేసి చూస్తుంటారు. తిండి కోసం, నీళ్ల కోసం ఒకరినొకరు నరుక్కునే స్థాయికి వెళ్తారు.
ఈ వైరస్ భయం కంటే, పక్కన ఉన్న మనుషుల స్వార్థమే ఎక్కువ భయం కలిగిస్తుంది. హీరో, హీరోయిన్ కలిసి ఆ జొంబీ మనుషుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. హీరోకి హీరోయిన్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం, ఆమె కోసం ఏమైనా చేస్తాడు. హీరోయిన్ కూడా చాలా ధైర్యవంతురాలు, ఎవరికీ వణకదు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా వీళ్లిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ, ఆ రాక్షసుల మధ్య ఎలా నెట్టుకొచ్చారో చూడాలి. చివరికి వీళ్లు బతికి బయటపడ్డారా లేదా అన్నది మంచి ట్విస్టులతో సాగుతుంది.
Read Also : ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే వరుస హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ… అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్