E-Paper
Advertisement

అనుమతుల్లేని త్రివిద్య కళాశాల.. ముందుగానే ప్రవేశాల దందా!

అనుమతుల్లేని త్రివిద్య కళాశాల.. ముందుగానే ప్రవేశాల దందా!
Advertisement

Illegal Admissions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్లో కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముందస్తుగా యాజమాన్యం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. టెన్త్ పరీక్షలు మొదలు కావడానికి కార్యాలయాన్ని తరిచి, ప్రవేశాలు ప్రారంభించారు. ఇప్పటికే మరోచోట కళాశాలను నడపుతున్న యాజమాన్యం అక్కడ వచ్చిన ర్యాంకులను ఎరగా చేస్తూ పెద్ద ఎత్తున ప్రవేశాలను సేకరించింది. కళాశాల మాయమాటలను నమ్మినా తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలలో చేర్పిస్తున్నారు. ఇది మేర్చల్లో కొత్తగా ఏర్పాటు చేసిన త్రీ విద్య కళాశాల నిర్వాకం.

వివరాల్లోకి వెళితే..

మేర్చట్లో లో కళాశాలను ఏర్పాటు చేసుకున్న త్రి విద్య కళాశాలకు కళాశాల పేరిట ఎలాంటి అనుమతులు లేవు. అంతకు ముందు ఉన్న అనుమతి పొంది, ప్రస్తుతం మనుగడ లేదా కళాశాల రిజిస్ట్రేషన్ కు యాజమాన్యం కొనుగోలు చేసింది. దాన్ని రెన్యూవల్ చేసుకొని తర్వాత త్రీ విద్య పేరు మీదకు ఆ రిజిస్ట్రేషన్ను బదిలీ చేసుకోవాలన్నది యాజమాన్యం ప్రణాళిక రచించినట్టు సమాచారం. అయితే తాము కొనుగోలు చేసిన కళాశాల పేరుతో ప్రచారం ప్రారంభిస్తే ప్రవేశాలు రావని, త్రీ విద్య పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. మేర్సల్ నుంచి ప్రతి రోజు వందలాది మంది విద్యార్థులు చదువు కోసం సుచిత్ర, సికింద్రాబాద్కు వెళ్తున్నారు. అక్కడి వెళ్లి రావడానికి దూరభారం, బస్సుల్లో రద్దీతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Also Read: ఎన్నికల్లో బయో మెట్రిక్.. సుప్రీం కోర్టులో పిటిషన్​.. సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు!

అనుమతులు లేకుండా..

విద్యార్థినులు సైతం వచ్చేటప్పుడు ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇదే అదనుగా భావించిన యాజమాన్యం మీ ముగింట్లోకి కళాశాల వస్తుందని ప్రచారం చేయడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాలలో చేరడానికి ఆసక్తి చూపుతూ ప్రవేశాలు తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రవేశాలు తీసుకుకోవడం నిబంధనలు విరుద్ధమని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాంద్ చేస్తున్నారు. అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో విద్యను గొప్ప వ్యాపార వనరుగా మార్చుకున్న యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు..

యూఎస్ఎఫ్ ధర్నా

Advertisement

అనుమతుల్లేకుండా కళాశాలను ఏర్పాటు చేసుకొని, ప్రవేశాలు తీసుకుంటున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాంక్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్మా నిర్వహించారు. కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేశారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వెంకటేశ్ మాట్లాడుతూ త్రివిద్య జూనియర్ కళాశాల ఎలాంటి అనుమతుల లేకుండా అక్రమంగా కళాశాలను ఏర్పాటు చేసుకొని, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే తల్లిదండ్రులను మాయమాటలతో మోసం చేస్తూ ప్రవేశాలను తీసుకుంటుందన్నారు. ఇప్పటికీ 200 వరకు ప్రవేశాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండానే తీసుకుంటున్న ప్రవేశాలను అడ్డుకొని, కళాశాలను అధికారులు సీజ్ చేయాలని ఆయన డిమాంద్ చేశారు. లేదంటే విద్యార్థులు, తల్లిదండ్రులు కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

Also Read: ఆర్‌ఎస్‌ఎస్ వేదికలపై కనిపించిన మీరు.. మాకు న్యాయం చేస్తారా?.. హైకోర్టులో జ‌డ్జికి కేజ్రీవాల్ సవాల్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×