E-Paper
Advertisement

Strait of Hormuz: హోర్మూజ్‌ జలసంధి వద్ద టెన్షన్.. ఇరాన్ బోట్లను పేల్చేయండి, అలాగైతే నో చర్చలు

Strait of Hormuz: హోర్మూజ్‌ జలసంధి వద్ద టెన్షన్.. ఇరాన్ బోట్లను పేల్చేయండి, అలాగైతే నో చర్చలు
Advertisement

Strait of Hormuz: పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు ఉంటాయా? వీటిపై రాయబారం నడుస్తున్న వేళ అమెరికా ప్రకటన‌పై ఇరాన్‌ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది? అలాగైతే చర్చలు ఉండవని ఇరాన్ చేస్తోందా? ఈ నేపథ్యంలో సముద్ర గర్భ కేబుళ్లపై ఫోకస్ చేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

హోర్మూజ్‌ జలసంధి వద్ద కొనసాగుతున్న టెన్షన్

Advertisement

పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా సద్దు మణగలేదు. రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్-అమెరికా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చలపై కొనసాగడం కష్టమేనన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ మండిపడింది.

ఇంతకీ ట్రంప్ ప్రకటన ఏంటి? హోర్మూజ్‌ జలసంధిలో మందుపాతరలను అమరుస్తున్న ఇరాన్‌ పడవలను కాల్చి వేయాలని అమెరికా నేవీ బలగాలకు ట్రంప్‌ తాజాగా ఆదేశించారు. చిన్న బోట్లను వదిలిపెట్టొద్దని అందులోకి సారాంశం. ఎందుకంటే హర్మూజ్ జలసంధి‌లో మూడు రవాణా నౌకలపై ఇరాన్‌ ఐఆర్‌జీసీ బలగాలు కాల్పులు జరిపిన మరునాడే ట్రంప్ ప్రకటన చేశారు.

Advertisement

ఇరాన్ బోట్లను పేల్చేవేయాలంటూ ట్రంప్ ఆదేశాలు.. అలాగైతే చర్చలు లేవన్న ఇరాన్

అంతేకాదు జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందన్నారు. ప్రస్తుతం జలసంధిలో మైన్స్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచన చేశారు. మరిన్ని మైన్ స్వీపర్లను హోర్మూజ్ జలసంధికి తరలించాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. తమ నేవీ విభాగం అనుమతి లేకుండా అందులోకి నౌకలు రావడం, బయటకు వెళ్లడం జరగదన్నారు.

మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. చర్చలు-ఒప్పందాలను తాము స్వాగతిస్తామని ఇరాన్ చెబుతోంది. అమెరికా మాట తప్పడం, బెదిరించడం, దిగ్బంధనానికి దిగడం వంటివి చర్చలకు చర్చలకు అడ్డంగా మారాయన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌.

ALSO READ: భారత్‌ నరకం వ్యాఖ్యలపై ట్రంప్ యూ-టర్న్.. తిట్టినా మనోడే.. పొగిడినా మనోడే

ఆయన మాటలను ప్రపంచం ఎప్పటికప్పుడు గమనిస్తోందని ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అమెరికా తమ దిగ్బంధనాన్ని కొనసాగించినంత కాలం హోర్మూజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్ ఇప్పటికే ‌ స్పష్టం చేసిన విషయం తెల్సిందే.

ఇదిలావుండగా అమెరికా బలగాలు జలసంధి వద్ద దిగ్బంధనాన్ని కంటిన్యూ చేస్తే హర్మూజ్‌లో సముద్ర గర్భ కేబుళ్లు తెగొచ్చంటూ ఐఆర్‌జీసీ అనుబంధ వార్తాసంస్థ తస్నిమ్‌లో ఓ ప్రకటన వచ్చింది. ఆ కేబుళ్లకు నష్టం వాటిల్లితే గల్ఫ్‌ అంతటా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×