E-Paper
Advertisement

Thriller Series OTT: చాకచక్యంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్… టెక్నాలజీతో ఊహకందని ట్విస్టులు… ఐయండిబిలో 8.0 రేటింగ్ కూడా

Thriller Series OTT: చాకచక్యంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్… టెక్నాలజీతో ఊహకందని ట్విస్టులు… ఐయండిబిలో 8.0 రేటింగ్ కూడా
Advertisement

Thriller Series OTT : ఓటీటీలోకి ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు భారీ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన మూడో సీజన్ మరింత ఉత్కంఠతతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సిరీస్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఐయండిబిలో దీనికి ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉంది. 2019లో మొదలైన మొదటి సిరీస్ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇది ముఖ్యంగా సిసిటివి (CCTV) ఫుటేజీని ఎలా తారుమారు చేయవచ్చు అనే అంశం చుట్టూ తిరుగుతుంది. అంటే మనం కళ్లారా చూసే వీడియో సాక్ష్యాలను కూడా టెక్నాలజీతో ఎలా మార్చవచ్చో, దాని ద్వారా ఒక వ్యక్తిని ఎలా ఇరికించవచ్చో ఇందులో చాలా సీరియస్‌గా చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే  

ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది క్యాప్చర్’ (The Capture). ఇందులో హాలీడే గ్రాంజర్ (డిటెక్టివ్ రాచెల్ కారీగా), కాలమ్ టర్నర్ (షాన్ ఎమెరీగా) లీడ్ రోల్స్ లో నటించారు. 2019లో వచ్చిన సీజన్ 1 లో 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది పూర్తిగా షాన్ ఎమెరీ కేసు చుట్టూ తిరుగుతుంది. 2022 లో వచ్చిన సీజన్ 2లో కూడా 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది రాజకీయ నాయకులు డిజిటల్ ఫుటేజీని మార్చి ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారో చూపిస్తుంది. ఈ రెండు సిరీస్ లు jio hotstarలో అందుబాటులో ఉన్నాయి. ఇక దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత సీజన్ 3 ప్రేక్షకు ముందుకు వచ్చింది. ఇది 2026 మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఈ ఎనిమిది ఎపిసోడ్ ల సిరీస్ ఒరిజినల్‌గా BBC One లో టెలికాస్ట్ అయ్యింది. Peacock ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

షాన్ అనే ఒక మాజీ సైనికుడు ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. కోర్టులో వీడియో సాక్ష్యం సరిగ్గా లేకపోవడంతో అతను నిర్దోషిగా బయటపడతాడు. కానీ అదే రోజు రాత్రి అతను తన లాయర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఒక CCTV ఫుటేజీలో కనిపిస్తుంది. పోలీసులు అతన్ని పట్టుకుంటే, నేను ఏ తప్పూ చేయలేదు, ఆమెను బస్సు ఎక్కించి పంపించానని చెప్తాడు. కానీ కెమెరాలో మాత్రం అతను ఆమెను కొట్టి తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ రాచెల్ కారీకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదే కరెక్షన్ అనే టెక్నాలజీతో స్టోరీ వహించని మలుపులు తిరుగుతుంది. దీని ద్వారా నిఘా సంస్థలు మన కళ్ల ముందే జరుగుతున్న సీన్‌ను కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మార్చి, వేరే విధంగా చూపించగలవు.

అంటే షాన్ అక్కడ ఏ తప్పూ చేయకపోయినా, అతను తప్పు చేసినట్లు వీడియోని సృష్టించారని ఆమెకు అర్థమవుతుంది. నిజం తెలిసినా కూడా రాచెల్ ఆ వ్యవస్థను ఎదిరించలేకపోతుంది. ఎందుకంటే ఆ టెక్నాలజీని వాడుతున్నది పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలే. వీడియో సాక్ష్యం ఉంటే ఎవరైనా నమ్ముతారనే ధీమాతో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. చివరికి షాన్ ఆ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు ? రాచెల్ అతనికి సహాయం చేయగలిగిందా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : తప్పిపోయిన ఆవు కోసం కంగారుపడే పిల్లాడు… ఓటీటీలోకి వచ్చిన ఓ పల్లెటూరి కథ

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×