BigTV English

OTT Movie : కట్టుకున్న భర్తను వదిలేసి ఎవడితో పడితో వాడితో… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా అయ్యా

OTT Movie : కట్టుకున్న భర్తను వదిలేసి ఎవడితో పడితో వాడితో… ఇదెక్కడి దిక్కుమాలిన కథరా అయ్యా

OTT Movie : ఓటీటీలో క్రైమ్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇందులో తండ్రి పిల్లలను సరిగ్గా పట్టించుకోక పోతే ఎలా ఉంటుందో చూపించారు. ఈ సినిమా చివరి వరకూ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హిందీ నియో-నోయిర్ క్రైమ్ డ్రామా మూవీ పేరు ‘తిత్లీ’ (Titli). 2014 లో వచ్చిన ఈ సినిమాకి కను బెహల్ దర్శకత్వం వహించారు. దీనిని దిబాకర్ బెనర్జీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఇందులో శశాంక్ అరోరా (తిత్లీ), శివానీ రఘువంశీ (నీలు), రణవీర్ షోరీ (విక్రమ్), అమిత్ సియాల్ (ప్రదీప్ అలియాస్ బావ్లా), లలిత్ బెహల్ (తండ్రి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2014 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సర్టైన్ రిగార్డ్ విభాగంలో ప్రదర్శించబడింది. 124 నిమిషా రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.5/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటలో ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఢిల్లీలోని మందవాలి ప్రాంతంలో ముగ్గురు సోదరులలో, చిన్నవాడైన తిత్లీ చుట్టూ తిరుగుతుంది. అతని పెద్ద సోదరుడు విక్రమ్, రెండో సోదరుడు ప్రదీప్ ఒక క్రిమినల్ గ్యాంగ్‌ను నడుపుతుంటారు. వారి తండ్రి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేస్తే సరిపోతుందని భావిస్తాడు. పిల్లల గురించి పెద్దగా పట్టించుకోడు. తిత్లీ తన సోదరులకు భిన్నంగా, ఈ నేర జీవితం నుండి తప్పించుకోవాలని కలలు కంటాడు. అతని ఆశయం ఒక రాబోయే మాల్‌లో ₹3,00,000తో పార్కింగ్ లాట్‌ను కొనుగోలు చేసి, గౌరవంగా జీవించాలనుకుంటాడు. అందుకే ఇంటి నుంచి బయటపడాలని అనుకుంటాడు. ఒక రోజు అతను తన సోదరులకు అసలు విషయం చెప్పాల్సి వస్తుంది. కోపంతో ఉన్న విక్రమ్, తిత్లీని అదుపులో ఉంచడానికి, నీలు అనే యువతితో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు. ఆమె తిత్లీని కుటుంబానికి, నేర కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భావిస్తాడు.

అయితే నీలు ప్రిన్స్ అనే ధనవంతుడైన పెళ్ళయిన వ్యక్తి ప్రేమలో ఉంటుంది. అతను తన భార్యను విడాకులు ఇచ్చి నీలుతో ఉంటానని వాగ్దానం చేస్తాడు. తిత్లీ కుటుంబం హింసాత్మక కార్యకలాపాలను చూసిన తర్వాత, నీలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ తరువాత ఆమె తిత్లీకి పట్టుబడుతుంది. అతను ఆమెను కుటుంబానికి అప్పగించడానికి బదులు, ఒక ఒప్పందం ప్రతిపాదిస్తాడు. ఆమె తన ఫిక్స్‌డ్ డిపాజిట్ నుండి ₹2,50,000 ఇస్తే, అతను ఆమెను ప్రిన్స్‌తో తిరిగి కలపడానికి సహాయం చేస్తానని చెప్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని ట్విస్టులతో నడుస్తుంది. చివరికి తిత్లీ తాను అనుకున్న లైఫ్ ని పొందుతాడా ? నీలు తన ప్రేమికున్ని కలుసుకుంటుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : పెళ్ళైనా పట్టించుకోని భర్త… రోజుకో మగాడితో ఆ లేడీ కానిస్టేబుల్ చేసే పనికి దిమ్మతిరగాల్సిందే

Related News

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

Big Stories

×