Illu Illalu Pillalu Today Episode june 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ చదువు కోసం ధీరజ్ చేస్తున్న త్యాగం గురించి చెప్తుంది. ప్రేమించే వ్యక్తి దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని నర్మదా అంటుంది. ప్రేమ నేను మాత్రమే కాదు నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అని సాగర్ నిర్ణయం గురించి అంటుంది. ఆ మాట వినగానే నర్మదా నవ్వుతుంది. ఆయనకు రైస్ మిల్ లే మొదటి పెళ్ళాం అలాంటిది జాబ్ చేస్తాడా అని అడుగుతుంది. ఉదయం మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా అక్కడ మీ నాన్న వాళ్ళు నిన్ను బాధ పెట్టారంట కదా దానికి బావగారు బాధపడిపోయారట. జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడట అని ప్రేమ అంటుంది..
భార్య కోసం బావ అలాంటి పని చేయడం నిజంగా గ్రేట్ కదా కానీ ప్రేమ అంటుంది. మాట వినగానే నర్మదా సాగర్ పై ప్రేమతో సంతోషం ఉరకలు వేస్తూ పొంగిపోతుంది.. ఒక్కక్షణం తనని తానే మర్చిపోయి సాగర్ కోసం వెతుకుతుంది. ప్రేమ అక్క అని పిలుస్తూ ఉన్నా కూడా నర్మదా సాగర్ ని వెతుకుతూ గాల్లో తేలుతూ ఉంటుంది. ఎదురుగా సాగర్ కనిపించడంతో అస్సలు ఆగకుండా వెనక నుండి వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి పిల్ల అందరూ ఉన్నా కూడా ఇలా చేసింది అని అనుకుంటారు. అందరు ఒక్కోక్కరుగా భర్తలను హగ్ చేసుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ఊళ్లో దొంగలు పడి ఇళ్లని దోచేయడంతో ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుని బ్యాంక్ లాకర్‌లో పెట్టేయమని వేదవతితో చెప్తాడు రామారాజు. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. తన దగ్గర ఉన్న నగల్ని బ్యాంక్ లాకర్‌లో పెడితే.. అవి గిల్టు నగలు అని తెలిసిపోతుందని భయపడిచస్తుంది. హగ్ చేసుకొని మ్యానేజ్ చేసుకుంది. అలాగే తర్వాత రోజు వేదవతి నగల కోసం కోడళ్ళను అరుస్తుంది. నర్మద, ప్రేమలకు నగలను తీసుకొచ్చి ఇవ్వమని చెప్తుంది..
చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా? అని అడుగుతుంది శ్రీవల్లి. ‘ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని అంటుంది వేదవతి. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి.. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య కానీ వేదవతి మీ మామయ్య అస్సలు వినడు. నన్ను అరుస్తాడు అని అంటుంది. శ్రీవల్లి వెళ్లి భాగ్యంకు ఫోన్ చేస్తుంది.
అమ్మా.. మా ఏరియాలో దొంగలు పడ్డారట. అందుకని అందరి నగల్ని లాకర్‌లో పెడుతున్నారు. అప్పుడు ఇవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసిపోతుంది. దీంతో పాటు.. పెళ్లి కోసం మనం ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతుంది. నా కాపురం నిలువుగా కూలిపోతుంది. ఆయనంటే నాకు చచ్చేంత ప్రేమే.. ఆయన దూరం అయితే నేను బతకలేనే’ అని అంటుంది శ్రీవల్లి.. కానీ నగలను ఇచ్చేయ్యమని అంటుంది.. అయితే బ్యాంక్ కు వెళ్లకుండా ఏదోకటి చెయ్యు మిగితాది నేను చూసుకుంటాను అని అంటుంది.
Also Read: ఈ ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..
ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. కానీ ధీరజ్ రాలేదని ప్రేమ ఎదురు చూస్తూ బయట కూర్చుని ఉంటుంది. ఏంటి ఇంకా సార్ గారు రాలేదా అని రామరాజు అడుగుతాడు.. రాలేదు నాన్న అని అందరూ సమాధానం చెబుతారు. ఇది చందు ని సార్ గారికి ఒకసారి ఫోన్ చేయండి అంటారు. నాకు ఇంకా డ్యూటీ పూర్తవలేదు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది అని ధీరజ్ అంటాడు. ధీరజ్ అక్కడికి వెళ్లి ఉంటాడని నర్మదా సాగాలు మాట్లాడకుండా చూసి శ్రీవల్లి రామరాజుతో అంటుంది.. ఎవరైనా నాకు తెలియకుండా ఏదైనా చేయాలి ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు అని అందరికీ రామరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..