Gundeninda GudiGantalu Today episode june 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఫంక్షన్ హడావిడిలో ఉంటుంది. అందరూ రెడీ అవుతున్నారు రోహిణికి చీర ఇద్దామని అక్కడికి వెళుతుంది. రోహిణి విజ్జి మాట్లాడుకుంటూ ఉంటారు. మా అత్తయ్య ఈమధ్య నా మీద ప్రేమను పూర్తిగా తగ్గించేసింది. మా నాన్నని తీసుకురావాలని తెగేసి చెప్పేసింది అని అంటుంది.. అప్పుడే ప్రభావతి డోర్ కొడుతుంది.. అత్తగారింటి తరపున నీకు పెట్టాల్సిన చీరను తీసుకొచ్చాను. ఇదిగో తీసుకొని రోహిణి చేతికి ఇస్తుంది.. రోహిణి ఆ చీర తీసుకోగానే మీ నాన్న ఎక్కడ వరకు వచ్చాడు. అసలు వస్తున్నాడా లేదా అప్పుడెప్పుడో ఫ్లైట్ ఎక్కాడు అని అడిగావు కదా వెంటనే నువ్వు ఫోన్ చేసి అడుగు ఎక్కడున్నాడు అని అడుగుతుంది.. ఫ్లైట్లో ఉన్నాడు అత్తయ్య ఫోన్ పనిచేయదు కదా.. నాట్ రిచబుల్ వస్తుందనేసి అంటుంది.
ఈసారి మాత్రం మీ నాన్న రావాల్సిందే అని ప్రభావతి తేల్చి చెప్పేస్తుంది.. ఇలా ఎప్పుడు మీ నాన్నని అడిగినా అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. పెళ్లి టైంలో అలానే వస్తున్నాడు అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు వస్తున్నాడు అని అంటున్నావ్ తప్ప అసలు వస్తాడో రాడో తెలియట్లేదు. కూతురు కన్నా బిజినెస్ లు ఎక్కువ అనేసి ప్రభావతి అడుగుతుంది. పెళ్లెప్పుడు ఎలాగో రాలేదు కనీసం ఇది చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఇప్పుడు రాకుండా ఉంటే నేనేం చేస్తానో నాకు తెలియదని ప్రభావతి అంటుంది.. ఆ మాటకు రోహిణి భయపడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. సురేంద్ర సత్యం ను ఎలాగైనా అవమానించాలని అనుకుంటాడు. తన ఫ్రెండుని సత్యం పక్కన కూర్చోబెట్టి కాలు తగిలేలా చేస్తాడు. అది గమనించిన సత్యం సురేందర్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు. ఆ బాలు ఎక్కడ చివర్లో ఉన్నాడు.. ఇక్కడే కనుక ఉనింటే పెద్ద రచ్చ చేసేవాడు అని రంగాతో అంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇలా చేయడం ఏంట్రా అని రంగ కూడా అంటాడు. ఈ డబ్బున్నోళ్లంతా ఇంతే రా.. కుటుంబలు విలువలు కన్నా తమ పంతం తనదే.. పద మనం వెళ్లి వేరేచోట కూర్చుందామని అంటాడు.
బాలును అడ్డుగా పెట్టుకొని ఫంక్షన్ మొత్తాన్ని ఖరబ్ చేయాలని, ఆ నింద మొత్తం బాలుపైనే తోసేయాలని ఇద్దరు ప్రత్నిస్తున్నారు. తొలుత శృతి వాళ్ల అమ్మ శోభ బాలుపై కుట్ర పన్నుతుంది. తన కూతురు శృతిని, రవిని పూర్తిగా తమ ఇంటికి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇందుకు తాళి మార్చే ఫంక్షన్ పేరుతో పెద్ద ఎత్తున బంధువులు, తమ బలగాన్ని ఆహ్వానిస్తారు. ఇక బాలుతో గొడవ చేయించేందుకు తమ అనుచరులను కూడా ఫంక్షన్ లోకి రానిస్తారు. వాళ్లతో ఎలాగైనా బాలుతో గొడవ పడేలా చేయాలని, బాలుకు ముక్కు మీదనే కోపం ఉంటుంది. మీనా పక్కనే ఉండి బాలును కంట్రోల్ చేస్తుంది.
Aslo Read:శ్రీవల్లి నోటి దూల.. మరోసారి అడ్డంగా బుక్కయిన ధీరజ్.. అయ్యో పాపం..
శోభన పక్కా ప్లాన్ ప్రకారం ఇద్దరు వ్యక్తులను మాట్లాడి తీసుకొని వస్తుంది. బాలుని ఇరికించేందుకు రోహిణి మందు సెటప్ చేస్తుంది. సెట్ అనే మాటవిని ఎవరు అంటు ఎంట్రీ ఇస్తాడు మనోజ్. కంగారుపడుతుంది రోహిణి..అంతలోనే కవర్ చేస్తుంది. శోభ ఫంక్షన్ హాల్ మొత్తం వెతుకుతూ ఉంటుంది..ఎవరి గురించి వెతుకుతున్నావని సురేంద్ర అడిగితే.. నేను బాలుని గొడవ చేసేలా చేయమని ఇద్దరు మనుషులను పురమాయించాను వాళ్లింకా రాలేదు అంటుంది. శోభా మనుషులు బాలు కాలు తొక్కుతారు. దానికి బాలు సీరియస్ అవుతాడు.. బాలు కాలు కావాలనే తొక్కి వెళతారు. కళ్లు కనిపించవా అంటూ ఫైర్ అవుతాడు బాలు.. ఇంతలో మీనా లేచి గొడవ ఆపేందుకు ట్రై చేస్తుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..