E-Paper
Advertisement

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే
Advertisement

South Indian OTT Releases June 2026 : జూన్ మొదటి వారం ఓటీటీలో దక్షిణాది సినిమాలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు ఈ వారం అదిరిపోయే ట్రీట్. థియేటర్లలో మిస్ అయినా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి సరైన సినిమాలు వచ్చేశాయి. ఈ వారం చూడాల్సిన టాప్ 5 తెలుగు, కన్నడ సినిమాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1. మెకానిక్ రాకీ (Mechanic Rocky)

విశ్వక్ సేన్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ ‘మెకానిక్ రాకీ’. రాకేష్ అలియాస్ రాకీ అనే ఉల్లాసభరితమైన మెకానిక్ తన పూర్వీకుల గ్యారేజీని ఒక క్రూరమైన భూకబ్జాదారుడి నుంచి కాపాడటానికి బయలు దేరతాడు. స్థానిక రౌడీ రంకి రెడ్డి ఆ ఆస్తిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే రాకీ ఒక పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ మోసాన్ని వెలికితీస్తాడు. 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ జూన్ 5న Sun NXT ఓటీటీలో రిలీజ్ కానుంది.

2. ది రైజ్ ఆఫ్ అశోక్ (The Rise of Ashok)

Advertisement

ఇదొక కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఒక పేద మంగళి వర్గానికి చెందిన విద్యావంతుడైన యువకుడు తన గ్రామాన్ని క్రూరమైన ముఠా నుంచి కాపాడుకోవడం కోసం తన వ్యక్తిగత ఆశయాలను వదులుకుని పోరాడే కథ ఈ మూవీ స్టోరీ. సతీష్ నినాసం, సప్తమి గౌడ్, యష్ శెట్టి నటించిన ఈ 2 గంటల 13 నిమిషాల మూవీ జూన్ 5 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది.

3. మూల్యం (Moolyam )

తెలుగు డ్రామా ‘మూల్యం’ కూడా ఈ వారం ఓటీటీలోకి రానుంది. గౌరవం, నిజాయితీ, ఆత్మగౌరవం చుట్టూ అల్లుకున్న ఉద్రిక్తమైన భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి. మోహన్ భగత్, అఖిల్ భనేశ్వర్, దీపక్ మేర్ల కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానుంది.

4. పీటర్ (Peter)

Advertisement

మరో కన్నడ డ్రామా ‘పీటర్’. సమస్యలతో సతమతమవుతున్న ఒక డ్రమ్మర్ తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. ఈ క్రమంలోనే ఒక దేవాలయ ఉత్సవంతో ముడిపడిన గత వైరం, ప్రేమ, ద్రోహం, హింసలతో కూడిన చిక్కుముడిని విప్పుతాడు. ఇందులో రాజేష్ ధృవ, జాన్వీ రాయల్, రవిక్షా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. 2 గంటల 21 నిమిషాలు నిడివి ఉన్న ఈ మూవీ జూన్ 5 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : అబ్బాయిలు కన్పిస్తే రెచ్చిపోయి ఆ పాడు పని చేసే మోహినీ పిశాచి

5. KD : The Devil

ధృవ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ‘కేడీ ది డెవిల్’. భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ధక్ దేవాను ఆరాధించే సాధారణ యువకుడు కాళి దాస్ (KD). అతని జీవితం కొన్ని సంఘటనల వల్ల ఎలా మారిపోతుంది అనేది కథ. దేవా గురించి షాకింగ్ నిజాలు తెలిసినప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతడు తన ఆరాధ్య దైవానికే ఎదురు నిలబడతాడు. జూన్ 5న ZEE5లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×