E-Paper
Advertisement

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్
Advertisement

This Week South Movies on OTT : జూన్ మొదటి వారం ఓటీటీలో మలయాళం, తమిళ సినిమాలు బాగా హల్‌చల్ చేస్తున్నాయి. యాక్షన్, డ్రామా, రొమాన్స్ ఇష్టపడే వాళ్లకు ఈ వారం సూపర్ సినిమాలు, సిరీస్ లు వచ్చేశాయి. థియేటర్లలో మిస్ అయినా ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడానికి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ వారం చూడాల్సిన టాప్ 3 మలయాళ, తమిళ చిత్రాలు, వాటి వివరాలు ఇవే.

1. Patriot

మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, నయనతార, రేవతి వంటి సూపర్ స్టార్లు నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘పేట్రియాట్’. పెరిస్కోప్ అనే స్పైవేర్, టెక్ దిగ్గజం శక్తి సొల్యూషన్స్‌ తో ముడిపడిన భారీ నిఘా కుట్రను వెలికి తీసిన శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ జేమ్స్ కథ ఇది. రహస్య సమాచారం లీక్ చేసి లండన్‌ కు పారిపోయిన అతను, కొన్ని సంవత్సరాల తర్వాత రిటైర్డ్ కల్నల్ రహీమ్ నాయక్, మైఖేల్ దేవస్సీ సహాయంతో ఆ కుట్ర వెనుక ఉన్న శక్తి సుందరాన్ని ఎలా ఎదుర్కొంటాడు అన్నది స్టోరీ. జూన్ 5 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది.

2. Karmani Selvam

Advertisement

పి. సముద్రఖని, గౌతం వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి నటించిన తమిళ ఫ్యామిలీ డ్రామా ‘కర్మణి సెల్వం’. సెల్వం అనే టాక్సీ డ్రైవర్ తన భార్య శాంతితో కలిసి ఒక ఇల్లు కట్టుకోవాలని కలలు కంటాడు. కానీ పెరిగిపోతున్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అతడిని అప్పుల్లోకి నెట్టేస్తాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అతను తీవ్రమైన సాహసాలు చేసి, చివరికి దేశం వదిలి వెళ్లవలసి వస్తుంది. ఆ సవాళ్లను అతను ఎలా అధిగమిస్తాడనేదే ఈ సినిమా ప్రధానాంశం. 2 గంటల 24 నిమిషాలు ఉన్న ఈ మూవీ జూన్ 3 నుంచి Amazon Prime Video స్ట్రీమింగ్ కానుంది.

Also Read : థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే

3. 29

Advertisement

విధు, ప్రీతి అస్రానీ నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా ’29’. సరైన గుర్తింపు లేక సతమతమవుతున్న 29 ఏళ్ల యువకుడు, ఇండిపెండెంట్ మనస్తత్వం గల ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. వారి సంబంధం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఊహ, వాస్తవం మధ్య ఉన్న అంతరం ఏంటో తెలుసుకుంటారు. ఆ జంట మధ్య రిలేషన్ ను ఈ చిత్రం అందంగా చూపిస్తుంది. 2 గంటల 30 నిమిషాలు నిడివి ఉన్న ఈ మూవీ జూన్ 5 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం మలయాళం, తమిళ సినిమాలు మాత్రమే కాకుండా వివిధ భాషల్లో అనేక ఇతర చిత్రాలు కూడా OTTలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్ ఫ్యాన్స్ నుంచి రొమాంటిక్ డ్రామా లవర్స్ వరకు అన్నీ రకాల సినిమాలతో ఈ వీకెండ్ అదిరిపోతుంది.

Also Read : 14 రోజుల్లో 10 సినిమాలు – సిరీస్‌లు… జూన్ లో నెట్‌ఫ్లిక్స్‌లో మూవీస్ వెల్లువ

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×