E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సౌత్ సినిమాలు

ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సౌత్ సినిమాలు
Advertisement

South Indian OTT Releases This Week : ఈ వారం ఓటీటీ ప్రియులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. జూన్ మొదటి వారంలో ఎన్నో ఆసక్తికరమైన దక్షిణాది సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. అందులో యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, రొమాంటిక్… ఇలా అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్లకు ఇది సూపర్ టైమ్. ఈ వారం చూడాల్సిన టాప్ 7 దక్షిణాది సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

1. పేట్రియాట్

మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, నయనతార, రేవతి వంటి సూపర్ స్టార్లు నటించిన స్పై యాక్షన్ డ్రామా ఇది. ఒక శాస్త్రవేత్త దేశం కోసం ఎలా పోరాడతాడు ? అనేది ఈ సినిమా కథ. 3 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం జూన్ 5న ZEE5లో వస్తోంది. స్పై థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లు తప్పక చూడాలి.

2. మూల్యం

Advertisement

మోహన్ భగత్, అఖిల్ భనేశ్వర్ నటించిన తెలుగు డ్రామా. గౌరవం, నిజాయితీ, ఆత్మగౌరవం చుట్టూ తిరిగే భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమాలో ఉన్నాయి. జూన్ 5న ETV Winలో విడుదలవుతోంది. కుటుంబం, సంబంధాలు ఇష్టపడేవాళ్లకు బాగుంటుంది.

3. ది రైజ్ ఆఫ్ అశోక

ఇదొక కన్నడ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సతీష్ నినాసం, సప్తమి గౌడ్, యష్ శెట్టి నటించారు. ఒక పేద యువకుడు తన గ్రామాన్ని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ. 2 గంటల 13 నిమిషాల ఈ సినిమా జూన్ 5న Sun NXTలో వస్తోంది. యాక్షన్ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్.

4. కార్మెని సెల్వం

Advertisement

సముద్రఖని, గౌతం వాసుదేవ్ మీనన్ నటించిన ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి రాబోతోంది. ఒక టాక్సీ డ్రైవర్ తన కుటుంబం కోసం చేసే పోరాటం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. 2 గంటల 24 నిమిషాల ఈ సినిమా జూన్ 3న Amazon Prime Videoలో వస్తోంది.

5. పీటర్

రాజేష్ ధృవ, జాన్వీ రాయల్ నటించిన కన్నడ డ్రామా. ఒక డ్రమ్మర్ తన ఊరికి తిరిగి వచ్చి ఎదుర్కొనే సమస్యలు, గత వైరం.. ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. 2 గంటల 21 నిమిషాల చిత్రం జూన్ 5న Amazon Primeలో వస్తోంది.

6. 29

విధు, ప్రీతి అస్రానీ నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. 29 ఏళ్ల యువకుడు ఒక స్వేచ్ఛా మనస్తత్వం గల అమ్మాయితో ప్రేమలో పడి ఎదుర్కొనే సవాళ్లు ఈ సినిమాలో ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాల చిత్రం జూన్ 5న Netflixలో వస్తోంది.

Also Read : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 2 క్రేజీ కే-డ్రామాలు

7. KD: ది డెవిల్

ధృవ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను అలరించనుంది. ఒక సాధారణ యువకుడిని గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి ఎలా లాగారు అనేది ఈ సినిమా కథ. 2 గంటల 21 నిమిషాల చిత్రం జూన్ 5న ZEE5లో వస్తోంది.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×