E-Paper
Advertisement

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్
Advertisement

Turning Point Generation 9/11 OTT  : 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన ఉగ్రదాడులు కేవలం కొన్ని భవనాలను కూల్చేయలేదు… ప్రపంచ రాజకీయాలను, యుద్ధాలను, భద్రతా వ్యవస్థలను, కోట్లాది మంది జీవితాలను మార్చేశాయి. ఒక్క రోజు… వేల కుటుంబాల జీవితాలను మార్చేసింది. కానీ 25 ఏళ్ల తర్వాత కూడా ఆ దాడుల ప్రభావం ఎలా కొనసాగుతోంది ? ఆ రోజు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఇప్పుడు ఏం చెబుతున్నారు ? ఆఫ్ఘనిస్తాన్‌ లో యుద్ధం చేసిన యువ సైనికుల జీవితాలపై దాని ప్రభావం ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వచ్చిన కొత్త డాక్యుమెంటరీ ‘Turning Point: Generation 9/11’ ప్రత్యక్ష సాక్షుల మాటలు, అప్పటి ఘటనల జ్ఞాపకాలు, యుద్ధం తర్వాతి పరిణామాలు, ఓ తరం జీవితాలపై పడిన ప్రభావాన్ని ఈ డాక్యుమెంటరీ పరిశీలిస్తుంది. మరి 9/11 తర్వాత అసలు ఏం మారింది ? ఆ దాడుల ప్రభావం ఇప్పటికీ ఎందుకు కనిపిస్తోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

‘టర్నింగ్ పాయింట్ జనరేషన్ 9/11’ సాధారణంగా 9/11 దాడులు ఎలా జరిగాయో మాత్రమే చెప్పే డాక్యుమెంటరీ కాదు. ఆ దాడుల తర్వాత పుట్టిన లేదా చిన్న వయసులో ఉన్న ఓ తరంపై ఆ సంఘటన ఎలా ప్రభావం చూపిందనేదే ప్రధాన అంశం. దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, War on Terrorను కవర్ చేసిన జర్నలిస్టులు, యువ ఆఫ్ఘన్లు, 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఉపసంహరణను ఎదుర్కొన్న మెరైన్లు తమ అనుభవాలను పంచుకుంటారు.

Advertisement

దాడుల తర్వాత అమెరికా చేపట్టిన యుద్ధాలు, భద్రతా విధానాల్లో వచ్చిన మార్పులు, ముస్లిం, వలస సముదాయాలపై పెరిగిన అనుమానాలు, సోషల్ మీడియాలో పెరిగిన కుట్ర సిద్ధాంతాలు, రాజకీయ విభజన వంటి అంశాలను కూడా సిరీస్ లో చూపించారు. 9/11 ఒక చారిత్రక ఘటనగా మిగిలిపోయినా, దాని ప్రభావం వ్యక్తుల జీవితాల్లో ఇంకా కొనసాగుతూనే ఉందని చూపిస్తుంది. అసలు ఈ దాడులు ఒక తరాన్ని ఎలా మార్చాయి ? భయం, అనుమానం, యుద్ధం తర్వాతి ప్రపంచం వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి ? 25 ఏళ్ల తర్వాత కూడా ఆ గాయం ఎందుకు పూర్తిగా మానలేదు ? అనేదే ఈ డాక్యుమెంటరీలో ఆసక్తికరమైన అంశం.

Also Read : ఆ పాత భవంతిలో ఉంటే చస్తారు… దెయ్యాల కోట వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ స్ట్రీమింగ్ తెలుగులో

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

సెప్టెంబర్ 2 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రియాన్ క్నాపెన్‌బెర్గర్ దర్శకత్వం వహించిన ఇది… సుమారు 1 గంట 37 నిమిషాల నిడివి ఉన్న 2026 డాక్యుమెంటరీ. 9/11 చరిత్ర, ప్రపంచ రాజకీయాలు, యుద్ధం తర్వాతి పరిణామాలు వంటి అంశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ఇందులో ఇప్పటికీ ఆ దాడి గురించి తెలియని ఎన్నో విషయాలను ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ భయంకరమైన సంఘటన గురించి సీరియస్‌గా ఆలోచింపజేసే ఈ డాక్యుమెంటరీపై మరిచిపోకుండా ఒక లుక్కేయండి.

Also Read : 2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×