E-Paper
Advertisement

‘ది ఒడిస్సీ’ సినిమాకు వెళ్ళేముందు ఈ సినిమాలు చూడండి

‘ది ఒడిస్సీ’ సినిమాకు వెళ్ళేముందు ఈ సినిమాలు చూడండి
Advertisement

The Odyssey: ‘ది ఒడిస్సీ’ (The Odyssey 2026) సినిమా థియేటర్లలో దుమ్మురేపుతోంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఈ సినిమాను చూడడానికి ముందు, గ్రీక్ మహాకావ్యం ఆధారంగా వచ్చిన ఈ రెండు సినిమాలు చూస్తే… ‘ది ఒడిస్సీ’ స్టోరీ అర్థం కావడంతో పాటు మరింత అద్భుతంగా అనిపిస్తుంది. మరి ఆ మూడు సినిమాలు ఏంటి ? వాటి స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే… 

ముందుగా 2004లో వచ్చిన Troyగురించి మాట్లాడుకుందాం. ఇది భారీ విజువల్ ఎపిక్గ్రీక్ మహాకావ్యం ‘ఇలియడ్’ ఆధారంగా తెరకెక్కిన సినిమా. స్పార్టా రాణి హెలెన్‌ను ట్రాయ్ యువరాజు పారిస్ ప్రేమించి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. దీనికి ప్రతీకారంగా స్పార్టా రాజు మెనెలాస్, గ్రీక్ సైన్యాలు ట్రాయ్ నగరంపై దండెత్తుతాయి. ఈ 10 ఏళ్ల యుద్ధంలో గ్రీక్ మహా వీరుడు అకిలెస్, ట్రాయ్ వీరుడు హెక్టర్ల మధ్య జరిగే పోరు, చివరగా ప్రసిద్ధ “ట్రోజన్ హార్స్” ట్రిక్‌తో ట్రాయ్ నగరాన్ని గ్రీకులు ఎలా నాశనం చేశారనేది ఈ సినిమా కథ. బ్రాడ్ పిట్ అకిలెస్‌గా అద్భుతమైన యాక్షన్, ఎమోషన్ చూపించాడు. హెలెన్ పాత్రలో డయాన్ క్రూగర్, ఒడిస్సియస్‌గా సీన్ బీన్ కూడా బాగా నటించారు. యుద్ధ సన్నివేశాలు, విజువల్స్ ఇప్పటికీ అద్భుతంగా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. Netflixలో కూడా అందుబాటులో ఉంది. కానీ అందులో కేవలం ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఉండవచ్చు.

Advertisement

ఇక Troy The Odyssey 2017లో వచ్చింది. ట్రాయ్ యుద్ధం ముగిసిన తర్వాత కథ ఇది. గ్రీక్ వీరుడు, ఇథాకా రాజు అయిన ఒడిస్సియస్, యుద్ధం గెలిచాక తన సొంత రాజ్యానికి, భార్య పెనెలోప్ వద్దకు తిరుగు ప్రయాణమవుతాడు. కానీ సముద్ర దేవుడైన పోసిడాన్ ఆగ్రహం వల్ల అతని ప్రయాణం అనేక అడ్డంకులతో సాగుతుంది. మార్గమధ్యంలో ఒడిస్సియస్, అతని సైన్యం రాక్షసులు, మంత్రగత్తె, సముద్ర పిశాచాలు వంటి భయంకరమైన శక్తులను ఎదుర్కొని ఎలా ప్రాణాలతో బయటపడ్డారనేది ఈ లో-బడ్జెట్ యాక్షన్ సినిమా కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ ఇది ఇంగ్లీష్ ఆడియోతో మాత్రమే ఉంది.

చివరగా The Odyssey. 2026లో వచ్చిన ఈ క్రిస్టోఫర్ నోలన్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ విజువల్ ఎపిక్. హోమర్ రాసిన క్లాసిక్ ‘ఒడిస్సీ’ కథకు ఇది ఆధునిక, హై-ఎండ్ ఐమాక్స్ రూపం. ట్రాయ్ యుద్ధం తర్వాత ఒడిస్సియస్ ఇంటికి చేరుకోవడానికి పడే 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని నోలన్ తన మార్క్ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా చూపించారు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే, Amazon Prime Videoతో పాటు JioHotstar, Apple TV, YouTube, Peacock వంటి ప్రముఖ 5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో రెంట్ ఆప్షన్ లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Read Also: తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

Tags

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×