BigTV English

OTT Movie : ఒకే ఇంట్లో 13 సార్లు చావు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్… ఈ హర్రర్ మూవీలో సీన్ సీనుకూ గుండె జారిపోవాల్సిందే

OTT Movie : ఒకే ఇంట్లో 13 సార్లు చావు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్… ఈ హర్రర్ మూవీలో సీన్ సీనుకూ గుండె జారిపోవాల్సిందే

OTT Movie : హారర్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ స్టోరీ ఒక టైమ్ లూప్ లో జరుగుతుంది. ఒక మాన్షన్ లో ఇరుక్కున్న కొంతమంది, ప్రతీ రోజు రకరకాలుగా చనిపోతుంటారు. మళ్ళీ బ్రతుకుటుంటారు. అలా వీళ్ళ చావు 13 రకాలుగా జరుగుతుంది. ఈ స్టోరీకూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ? ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనేవివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

ఈ అమెరికన్ సర్వైవల్ హారర్ మూవీ పేరు ‘అంటిల్ డాన్’ (Until Dawn). 2025లో విడుదలైన ఈ సినిమాకి డేవిడ్ ఎఫ్. శాండ్‌బర్గ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2015లో సూపర్‌మాసివ్ గేమ్స్ రూపొందించిన వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. అయితే ఇది గేమ్ కథను నేరుగా అనుసరించకుండా, అదే యూనివర్స్‌లో కొత్త స్టాండ్‌లోన్ స్టోరీతో నడుస్తుంది. ఇందులో ఎల్లా రూబిన్ (క్లోవర్), మైఖేల్ సిమినో (మాక్స్), ఒడెస్సా ఆ’జియన్ (నీనా), జి-యంగ్ యూ (మెగాన్), బెల్మాంట్ కామెలి (ఏబెల్), పీటర్ స్టోర్‌మేర్ (డా. హిల్) ప్రధాన పాత్రలలో నటించారు. 2025 ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈసినిమా, Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో జూన్ 20 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

క్లోవర్ తన అక్క మెలనీ ఒక సంవత్సరం క్రితం గ్లోర్ వ్యాలీలో కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైందో తెలుసుకోవడానికి, తన స్నేహితులైన మాక్స్ , నీనా, ఏబెల్, మెగాన్ తో కలసి ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్తుంది. వీళ్ళు గ్లోర్ వ్యాలీకి చేరుకునే ముందు, ఒక గ్యాస్ స్టేషన్ వద్ద ఒక వింత మనిషి ఆ వ్యాలీ గురించి హెచ్చరిస్తాడు. భారీ వర్షం కారణంగా, వీళ్ళు ఒక పాడుబడిన విజిటర్ సెంటర్‌లో స్టే చేస్తారు. అక్కడ మిస్సింగ్ పర్సన్ ఫ్లైయర్‌లతో నిండిన ఒక బోర్డ్‌ను కనుగొంటారు. అందులో మెలనీ ఫ్లైయర్ కూడా ఉంటుంది. అకస్మాత్తుగా, ఒక మాస్క్డ్ కిల్లర్ వారిపై దాడి చేసి, ఒక్కొక్కరినీ కిరాతకంగా చంపేస్తాడు.

అయితే వీళ్ళంతా చనిపోయిన తర్వాత, రాత్రి మళ్ళీ రీసెట్ అవుతుంది. వీళ్ళంతా మళ్లీ రాత్రి ప్రారంభంలో జీవించి ఉంటారు. ఇది ఒక టైమ్-లూప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ప్రతి రాత్రి వీళ్ళంతా వేర్వేరు హారర్ థ్రెట్‌లను ఎదుర్కొంటారు. మాస్క్డ్ కిల్లర్, జోంబీలు, విచ్‌క్రాఫ్ట్, వంటి వాటితో భయంకరంగా చనిపోతుంటారు. అంతే కాకుండా ప్రతి లూప్‌లో, గ్లోర్ వ్యాలీ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుంటారు. చివరికి ఈ టైమ్ లూప్ నుంచి వీళ్ళంతా బయట పడతారా ? క్లోవర్ తన సిస్టర్ ని కనిపెడుతుందా ? ఈ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : సోషల్ మీడియాలో అమ్మాయి ప్రపోజల్… ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్ మావా

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×