OTT Movie : ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఒక మలయాళం సినిమా, నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా 2025లో ఆరవ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఇందులో దిలీప్ హీరో గా నటించాడు. ఇది అతనికి 150వ చిత్రం కావడం విశేషం. కుటుంబ నేపధ్యంలో సాగే ఈ సినిమా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (ZEE5)లో
ఈ మలయాళం కామెడీ డ్రామా మూవీ పేరు ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ (Prince and Family). 2025లో విడుదలైన ఈ సినిమాకి బింటో స్టీఫెన్ దర్శకత్వం వహించారు. షారిస్ మొహమ్మద్ దీనిని రచించారు. లిస్టిన్ స్టీఫెన్ మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ కింద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో దిలీప్, రానియా రానా, ధ్యాన్ శ్రీనివాసన్, సిద్ధిఖ్, బిందు పనిక్కర్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళై, జోసెకుట్టి జాకబ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కేరళలోని ఒక చిన్న పట్టణంలో జరిగే ఒక ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం 2025 మే 9న థియేటర్లలో విడుదలై, బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టింది. 2 గంటల 14 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.8/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం జీ 5 (ZEE5) లో 2025 జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ప్రిన్స్ చక్కలక్కల్ (దిలీప్)కేరళలోని సెంట్రల్ ట్రావెన్‌కోర్‌లోని ఒక చిన్న పట్టణంలో బ్రైడల్ బొటిక్‌ను నడుపుతుంటాడు. అతని కుటుంబం తల్లిదండ్రులు బేబీ (సిద్ధిఖ్), జాన్సీ (బిందు పనిక్కర్), సోదరులు జిన్స్ (ధ్యాన్ శ్రీనివాసన్), షిన్స్ (జోసెకుట్టి జాకబ్), వారి భార్యలు, పిల్లలు అతని ఆర్థిక ఆదాయంపై నే ఆధారపడి ఉంటారు. జిన్స్, షిన్స్ ఇద్దరూ వివాహం చేసుకుని కుటుంబాలను స్థాపించినప్పటికీ, ప్రిన్స్ తన జీవిత భాగస్వామిని పొందడంలో ఇంకా వెనకబడి ఉంటాడు. ఎందుకంటే అతను తన భార్యలో కొన్నితనకు నచ్చిన లక్షణాలను కోరుకుంటాడు. అయితే ఈ ఒంటరితనం, కుటుంబ బాధ్యతలు అతన్ని నిరాశకు గురిచేస్తాయి.
ఒక మ్యాచ్‌మేకింగ్ సైట్ ద్వారా, ప్రిన్స్‌కు చిన్జు రాణి (రానియా రానా) అనే ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌తో పరిచయం అవుతుంది. ఆమె అతనికి పూర్తి వ్యతిరేక స్వభావం కలిగి ఉంటుంది. సోషల్ మీడియాలో లైక్‌లు, ఫాలోవర్స్ కోసం ఆరాటపదుతుంది. చిన్జు ఒక ప్రముఖ వ్లాగర్, ఆమె తన జీవితంలోని ప్రతి క్షణాన్ని కంటెంట్‌గా మార్చడానికి ఇష్టపడుతుంది. ఆమె అందంగా ఉండటంతో, ప్రిన్స్ ఆమె గురించి తెలుసుకోకుండానే వివాహానికి అంగీకరిస్తాడు. కానీ ఈ నిర్ణయం అతని జీవితాన్ని, అతని కుటుంబ జీవన విధానాన్ని తలక్రిందులు చేస్తుంది. ప్రిన్స్, చిన్జుల వివాహం వీళ్ళ వ్యతిరేక స్వభావాల కారణంగా గందరగోళంలో పడుతుంది. చిన్జు సోషల్ మీడియా జీవనశైలి, ప్రిన్స్ శాంతమైన స్వభావం వల్ల సాంప్రదాయ కుటుంబంలో సమస్యలు వస్తాయి.
ఆమె తన వివాహ జీవితాన్ని కూడా కంటెంట్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇది ప్రిన్స్‌ను ఇబ్బందిపెడుతుంది.ఇది ఒక గందరగోళ సన్నివేశాలకు దారితీస్తుంది . చిన్జు సోషల్ మీడియా వ్యసనం, ఆమె చుట్టూ ఉన్నవారి జీవితాలలో తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ సమయంలో (KK) అనే ఒక స్నేహితుడు, ఒక సమస్యలో చిక్కుకుంటాడు. ఇది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడిన అబద్ధాల కారణంగా జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రిన్స్, అతని కుటుంబం ప్రయత్నిస్తుంది. చివరికి సోషల్ మీడియా వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ? ప్రిన్స్ వీటిని ఎలా అధిగమిస్తాడు ? ప్రిన్స్, చిన్జుల వివాహ బంధం ఎలా సాగుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 23 ఏళ్ల అబ్బాయితో 33 ఏళ్ల హీరోయిన్ పెళ్లి… క్రేజీ ఫేస్ బుక్ ప్రేమ