Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. గత కొన్ని నెలలుగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అటు పవన్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా సన్నాహాలు జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.. ఈ సినిమా విడుదల అవడానికి తక్కువ రోజులు ఉండడంతో ప్రమోషన్స్ లో జోరుని పెంచారు మేకర్స్.. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అవుతున్నారని సమాచారం..
ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్..
హరిహర వీరమల్లు మూవీకి ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగిలిన పార్ట్ పూర్తి అయ్యింది. జ్యోతి కృష్ణ నేతృత్వంలో టెక్నికల్ టీం కొత్త ట్రైలర్ రూపకల్పనలో నిమగ్నమై ఉంది. వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉండటంతో, దానిని బట్టి కొత్త ట్రైలర్ కట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తర్వాత థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యేలా చేస్తుందని అంచనా.. అయితే ఈ ట్రైలర్ను వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..
Also Read: ధనుష్ – నాగార్జున ‘కుబేర ‘.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
‘వీరమల్లు’ గ్రాండ్ లాంచ్..
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఈ సినిమాని అనౌన్స్ చేశారు. అప్పటినుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. తీరా విడుదల అవుతుంది అని అనుకునే లోపల కొన్ని కారణాలవల్ల సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చివరికి అన్నీ అడ్డంకులను దాటుకొని జూలై 24 న థియేటర్లలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. పవన్ కల్యాణ్ అద్భుతమైన పాత్రలో నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్‌గా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.. త్వరలోథియేటర్లలోకి రాబోతున్న హరి హర వీర మల్లు, ట్రైలర్ ద్వారా ఎంత హంగామా చేస్తుందో చూడాలి. అలాగే పవన్ పవర్‌తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి.. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు విషయానికొస్తే.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ మాస్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు.