Actor Sonu Sood:ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో నేపాల్ అందుకు నిదర్శనంగా మిగిలింది. చడీ చప్పుడు కాకుండా ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మాత్తుగా వచ్చిన వరద నేపాల్ ను తీవ్ర సంక్షోభంలో ముంచేసింది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు.. దెబ్బతిన్న ఇల్లు.. కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల కన్నీళ్లే కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి ఇన్ని రోజులు అవుతున్నా.. ఇంకా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు అంటే వరద ఉధృతి, అక్కడి జరిగిన విధ్వంసం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . ముఖ్యంగా ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు అలియాస్ రియల్ హీరో తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేయడానికి స్వయంగా నేపాల్ కు వెళ్లిన ఆయన .. తన చారిటీ ఫౌండేషన్ “సూద్” ద్వారా బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. ముఖ్యంగా బయట నుంచి చూస్తే తెలియదు కానీ దగ్గర్నుంచి చూస్తే జరిగిన నష్టం ఏపాటిదో అర్థమవుతుందని తెలిపారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలి అంటూ కోరారు. ఆయన మాట్లాడుతూ..” విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వెళ్లిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది. నేను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండవచ్చు. నీరు , శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల పైకి చేరుకోవాల్సి వచ్చింది . వారం రోజులు దాటినా ఇక్కడ విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మా సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా నా స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏమవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను సంప్రదిస్తున్న వారితో కూడా మాట్లాడి , వారు నేపాల్ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలరో తెలుసుకుంటూ సాధ్యమైనంత ఎక్కువ మందిని ఈ సహాయక చర్యలలో భాగస్వాములుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.. ప్రస్తుతానికి ఆహారపు పదార్థాలు, దుప్పట్లు అందిస్తున్నాము.పైగా మాకు చాలా దుప్పట్లు, ఆహార పదార్థాలు అందాయి. వారికి ఏది అవసరమో ఇంకా అడుగుతున్నాము.. భారతదేశం నుండి పంపించడానికి ప్రయత్నిస్తున్నాము అంటూ సోనూసూద్ వివరించారు.
also read:శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ఆకట్టుకుంటున్న ‘దేవరాయ’ టైటిల్ గ్లింప్స్ అండ్ ఫస్ట్ లుక్!
నేపాల్ – టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు రాళ్లు కూలిపోవడం వల్ల సంభవించిన ఈ ఆకస్మిక వరదలు ఆగస్టు 26న ఉత్తర, మధ్య నేపాల్ లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి.. నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ ఘటన జరిగి వారం రోజులు కాగా.. మృతుల సంఖ్య 1,127 కి చేరుకోగా.. ఇంకా నాలుగువేల మంది వరకు గల్లంతయినట్లు సమాచారం. దీంతో వారి ఆచూకీ కోసం భారీ స్థాయిలో గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారుగా 12,000 మందికిపైగా ప్రజలను రక్షించారు. మరోవైపు ఈ విపత్తులో శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి నేపాల్తో పాటు కొరియా, ఆస్ట్రేలియా, చైనా, భారత్ కి చెందిన నిపుణులు సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. సైనిక బృందాలు, రెస్క్యూ నిపుణులు కలిసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
Standing here today at the Trishuli River, where the floods have left behind unimaginable loss..broken homes, broken families, and lives changed forever. Nepal is not alone. I stand with its people, and I will do everything I can to bring hope, rebuild homes, and help families… pic.twitter.com/oJi344srKZ
— sonu sood (@SonuSood) September 2, 2026