E-Paper
Advertisement

Upcoming K dramas: కొరియన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదరగొట్టే సిరీస్‌లు ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ ?

Upcoming K dramas: కొరియన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్..  అదరగొట్టే సిరీస్‌లు ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ ?
Advertisement

Upcoming K dramas : కొరియన్ డ్రామా ప్రియులు 2026 సంవత్సరం అద్భుతమైన సిరీస్ లను చూడవచ్చు. థ్రిల్లర్, రొమాన్స్, ఎమోషనల్ డ్రామాలతో ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతున్న సిరీస్‌ల గురించి తెలు సుకుందాం.

1. ఆనర్ (Honour)

ఇది ఒక గ్రిప్పింగ్ లీగల్ థ్రిల్లర్. స్వీడిష్ హిట్ సిరీస్ ఆధారంగా రూపొందింది. ముగ్గురు మహిళా లాయర్ల చుట్టూ తిరుగుతుంది. బాధితుల పక్షాన నిలబడే ఈ ముగ్గురు లాయర్లు, ఒక భయంకరమైన కేసును విచారినలో జీవితాలను చిన్నాభిన్నం చేసే ఒక సంఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ప్రధానాంశంగా సాగే పవర్‌ఫుల్ కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 2026 ఫిబ్రవరి 2నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. బ్లడీ ఫ్లవర్ (Bloody Flower)

Advertisement

క్రైమ్ మిస్టరీ ఇష్టపడే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక వింత శక్తి ఉన్న వ్యక్తి చుట్టూ ఈ కథ సాగుతుంది. అతను ఒక సీరియల్ కిల్లర్ అయినప్పటికీ, చనిపోతున్న వారిని బతికించే అద్భుత శక్తిని కలిగి ఉంటాడు. ఈ విరుద్ధమైన లక్షణాల మధ్య సాగే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ సిరీస్. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు సూపర్ నేచురల్ టచ్ ఉండటం దీని ప్రత్యేకత. ఇది 2026 ఫిబ్రవరి 4 నుంచి jio hotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.

3. అవర్ యూనివర్స్ (Our Universe)

ప్రేక్షకులను నవ్విస్తూనే, కన్నీళ్లు పెట్టించే అందమైన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. ఒక ప్రమాదంలో అన్నయ్య, వదిన మరణించడంతో, వాళ్ళ చిన్న బాబు బాధ్యత బావ, మరదలు పై పడుతుంది. ఒకరినొకరు అస్సలు ఇష్టపడని వీళ్ళు ఆ బాబు కోసం కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళ మధ్య ప్రేమే కూడా పుడుతుంది. బే ఇన్ హ్యూక్, రో జియోంగ్ ఉయ్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు హైలెట్ గా ఉంటుంది. ఇది 2026 ఫిబ్రవరి 4 నుంచి Viki ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

4. ఇన్ యువర్ రేడియంట్ సీజన్ (In Your Radiant Season)

Advertisement

ఇది మనసును హత్తుకునే ఒక ఎమోషనల్ మెలోడ్రామా. ఒక ప్రమాదంలో తన గతాన్ని మరచిపోయిన ఒక యానిమేటర్, అతనికి అండగా నిలిచే ఒక ఫ్యాషన్ డిజైనర్ మధ్య సాగే కథ ఇది. వాళ్ళ జీవితాలు ఎలా సాగాయన్నదే ఈ డ్రామా. ఇది 2026 ఫిబ్రవరి 20 నుంచి jio hotstar లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also : దృశ్యం సినిమాను తలపించే తమిళ మూవీ… కూతురు లాంటి అమ్మాయితోనే ఆ పని… మతిపోగోట్టే సస్పెన్స్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×