E-Paper
Advertisement

Supreme Court: మూడు వారాల్లో తేల్చాలి.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం గడువు!

Supreme Court: మూడు వారాల్లో తేల్చాలి.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం గడువు!
Advertisement

Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మూడు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్​ కు సుప్రీం కోర్టు (Supreme Court) సూచించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్​ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై శుక్రవారం జస్టిస్​ అగస్టీన్​ జార్జ్​ మసీహ్​, జస్టిస్​ సంజయ్​ కరోల్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్ల మీద స్పీకర్ ఇప్పటికే విచారణ చేస్తున్నట్టు చెప్పారు.

స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టి

ఇప్పటి వరకు పార్టీ మారినట్టు పేర్కొన్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్​ చిట్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం మున్సిపల్, మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మార్చి నెల వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ మోహిత్ రావు స్పందిస్తూ మిగితా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Also ReadTelangana Budget Session: ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు.. ప్రభుత్వం కసరత్తు!

ఆ ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత ఏమీ లేదు 

ఆ ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హతపై విచారించటానికి ఇంకా ఏమీ లేదని చెప్పారు. ఈ ఇద్దరిలో ఒకరు బీఆర్​ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత కాంగ్రెస్​ లో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ కూడా చేసినట్టు తెలిపారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసినట్టు చెప్పారు. బీఆర్​ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సదరు నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినట్టు వివరించారు. అయితే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము ఇంకా బీఆర్​ఎస్​ లోనే ఉన్నామని చెబుతున్నారన్నారు. మొదట నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పేరుతో మరోసారి గడువు పెంచాలని అడుగుతున్నారన్నారు.

మూడు వారాలకు వాయిదా

Advertisement

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆ గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని పేర్కొంది. లేనిపక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Also Read: Telangana Municipal Elections: పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. తెర వెనుక ఏం జరిగింది?

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×