E-Paper
Advertisement

Vande Bharat Express: వందే భారత్‌కు బాంబు ముప్పు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఆగంతకుడి లేఖ.. వణికిపోతున్న ప్రయాణికులు!

Vande Bharat Express: వందే భారత్‌కు బాంబు ముప్పు.. రైళ్లను పేల్చేస్తామంటూ ఆగంతకుడి లేఖ.. వణికిపోతున్న ప్రయాణికులు!
Advertisement

Vande Bharat Express: భారతదేశ ప్రతిష్టాత్మక రైళ్లయిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను పేల్చివేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (GM) కార్యాలయానికి ఒక లేఖ అందింది. ఈ నెల 3వ తేదీన పోస్టు ద్వారా వచ్చిన ఈ లేఖలో దిగ్భ్రాంతికరమైన అంశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో నివసిస్తున్న నలుగురు వ్యక్తులతో కూడిన ఒక జిహాదీ బృందం ఈ దాడులకు కుట్ర పన్నిందని, రైల్వే లైన్లపై బాంబులు అమర్చి దాదాపు 250 మంది ప్రయాణికులను చంపడమే వారి లక్ష్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వ్యక్తి ఆ నలుగురు వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించడంతో రైల్వే భద్రతా బలగాలు ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాయి.

అయితే ఈ అంశంపై భద్రతా దళాలు లేఖ అందిన వెంటనే అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP), సివిల్ పోలీసులతో కలిసి తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వందే భారత్ రైళ్లు వెళ్లే మార్గాల్లో ట్రాక్ తనిఖీలు నిర్వహించడమే కాకుండా, రైలు లోపల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా సోదాలు చేపట్టారు. ప్రయాణికుల సామాగ్రిని స్కాన్ చేయడం, అనుమానిత వ్యక్తులను విచారించడం వంటి చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి.

Advertisement

ప్రస్తుతం ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. లేఖలో పేర్కొన్న పేర్లు నిజమైనవా లేక దర్యాప్తును పక్కదారి పట్టించడానికి సృష్టించినవా అనే అంశంపై ఆరా తీస్తున్నారు. లేఖ ఎక్కడి నుండి పోస్ట్ చేయబడింది? సీసీటీవీ ఫుటేజీల్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా? అని సాంకేతిక విభాగం సాయంతో విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి నకిలీ బెదిరింపు లేఖలు వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భద్రతా సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.

Also Read: విజయవాడలో దారుణం.. ప్రేమించానని వివాహితకు వేధింపులు.. చివరకు విషమిచ్చి

Advertisement

ఈ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. రైల్వే స్టేషన్లలో లేదా రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, లేదా యజమాని లేని వస్తువులను గమనించినా వెంటనే రైల్వే పోలీసులకు లేదా హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రయాణికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ కుట్ర వెనుక ఉన్న అగంతకుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×