E-Paper
Advertisement

Diabetes: డయాబెటీస్‌ గురించి చెప్పే ఇవన్నీ తప్పుడు నమ్మకాలేనట

Diabetes: డయాబెటీస్‌ గురించి చెప్పే ఇవన్నీ తప్పుడు నమ్మకాలేనట
Advertisement

భారతదేశంలో డయాబెటీస్ ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే డయాబెటీస్ పై ప్రజల్లో కొన్ని తప్పు నమ్మకాలు ఉన్నాయి. వాటినే నిజమని నమ్ముతున్నారు కూడా. ఈ అపోహల వల్ల వారు సరైన చికిత్స తీసుకోకపోవడం, వ్యాధిని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. ఫలితంగా డయాబెటీస్ ప్రభావం కిడ్నీలపై తీవ్రంగా పడుతోంది. వైద్యుల చెబుతున్న ప్రకారం కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో డయాబెటీస్ ప్రధాన కారణంగా మారింది. అయితే డయాబెటిస్ పై ఉన్న కొన్ని అపోహల గురించి ఇచ్చాము.

1. నేను చక్కెర తినను కాబట్టి నాకు డయాబెటీస్ రాదు
నిజానికి ఇది పూర్తిగా తప్పు. డయాబెటీస్ రావడానికి చక్కెర మాత్రమే కారణం కాదు. ఎక్కువగా బియ్యం, రొట్టెలు వంటి కార్బోహైడ్రేట్లు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, వంశపారంపర్య కారణాలు కూడా డయాబెటీస్‌కు దారి తీస్తాయి.

Advertisement

Also read: Chinese Oils: ఈ చైనా నూనెలు వాడారంటే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగేస్తుందట

2. డయాబెటీస్ వచ్చినా మందులు కొంతకాలం వాడితే పూర్తిగా తగ్గిపోతుంది
ఇలా అనుకోవడం కూడా మరో పెద్ద అపోహ. డయాబెటీస్ పూర్తిగా నయం కాకపోయినా, సరైన జీవనశైలి, మందులతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మందులు ఆపేస్తే వ్యాధి మళ్లీ తీవ్రంగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

3. డయాబెటీస్ ఉన్నవారు బియ్యం, రొట్టెలు తినకూడదు
ఇది కూడా పూర్తిగా తప్పుడు అపోహ. పూర్తిగా ఆహారాన్ని మానేయడం అవసరం లేదు. సరైన పరిమాణంలో, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

4. ఇన్సులిన్ ఇంజెక్షన్ మొదలుపెట్టితే పరిస్థితి చాలా ప్రమాదకరం
ఇన్సులిన్ వాడేందుకు ఎంతో మంది ఇలా భయపడే వారు కూడా ఉన్నారు. కానీ ఇన్సులిన్ అనేది ఒక చికిత్స విధానం మాత్రమే. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిని భయపడాల్సిన అవసరం లేదు. మరో తప్పు నమ్మకం ఏమిటంటే డయాబెటీస్ వృద్ధులకే వస్తుందనేది. ఇప్పుడు యువతలో, చిన్న వయసులోనే టైప్-2 డయాబెటీస్ పెరుగుతోంది.

Also read: Spinach Fry: పాలకూర నువ్వుల వేపుడు రెసిపీ, తింటే ఎంతో ఆరోగ్యం పైగా రుచికి రుచి

డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే దాని ప్రభావం నేరుగా కిడ్నీలపై పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీల్లోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో కిడ్నీలు రక్తాన్ని సరిగా శుద్ధి చేయలేవు. ఈ పరిస్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ప్రారంభ దశలో లక్షణాలు పెద్దగా కనిపించవు. క్రమంగా కాళ్ల వాపు, అలసట, మూత్రంలో ప్రోటీన్ రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. అప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×