BigTV English

OTT Movie : 2 గంటల 44 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… రేటింగ్‌లో ‘కాంతారా’ కంటే టాప్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTT Movie : 2 గంటల 44 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… రేటింగ్‌లో ‘కాంతారా’ కంటే టాప్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

OTT Movie : రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ సినిమా ఒక సెన్సేషనల్. 2022 లో ఎఏ సినిమా థియేటర్లలో ఒక ప్రభంజనం సృష్టించింది. ఆడియన్స్ కి ఈ సినిమా ఒక కొత్త తరహాలో కనిపించింది. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. అక్టోబర్ 2వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ₹300 కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం 800 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది. ఇప్పటికీ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఈ చిత్రం మొదటి భాగం కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. అయితే ‘కాంతార’ తో రేటింగ్ లో మరో చిత్రం పోటీపడుతోంది. ధనుష్ నటించిన ఈ సినిమాకి, ఐయండిబిలో ‘కాంతార’ కు మించిన రేటింగ్‌ ఉంది. ఈ సినిమా పేరు ? రేటింగ్ ఎంత ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ సినిమా అంటే

ఈ సినిమా పేరు ‘వడ చెన్నై’. 2018 అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ ధనుష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. విడుదలై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ధనుష్ తన అద్భుతమైన నటన అందరినీ ఆకట్టుకున్నాడు. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతారా’ సినిమా ఐయండిబి రేటింగ్స్ పరంగా 8.2 ఉంటే, ‘వడ చెన్నై’ సినిమా 8.4 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఈ సినిమా రేటింగ్స్ పరంగా ‘కాంతారా’ సినిమా కంటే ముందుంది. ఈ సినిమాకి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులోఉంది.

Read Also : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే


కథ ఏమిటంటే

ఈ కథ చెన్నైలో 1987లో మొదలవుతుంది. అంబు (ధనుష్) అనే యువకుడు, తన ఫ్రెండ్స్ తో కలసి సరదాగా జీవితం గడుపుతూ ఉంటాడు. అతని స్నేహితులు, ఈ ప్రాంతంలో రాజన్ అనే పెద్ద గ్యాంగ్‌స్టర్ దగ్గర చిన్న, చిన్న నేరాలు చేస్తుంటారు. ఒక రోజు అంబు స్నేహితులను, రాజన్ ప్లాన్ చేసి వాళ్లను జైలు పంపిస్తాడు. ఆ తరువాత కోపంతో వాళ్లు రాజన్‌ను చంపేస్తారు. దీంతో అక్కడ గ్యాంగ్ వార్ మొదలవుతుంది. అంబు అనుకోకుండా ఈ గొడవలో చిక్కుకుంటాడు.  ఈ సమయంలో అతను ముత్తు అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె అంబును ప్రేమిస్తుంది. కానీ వార్ లో అంబు స్నేహితులు చనిపోతారు. అతని ప్రేమ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఇక ప్రతీకారంగా అంబు ఆ గ్యాంగ్ ను ఎదుర్కుంటాడు. ఈ గ్యాంగ్ వార్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరికి అంబు తన స్నేహితుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటాడా ? అతని ప్రేమ కథ ఎంత వరకు వెళ్తుంది ? అనే విషయాలను, ఈ టాప్ రేటింగ్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో

OTT Movie : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?

OTT Movie : స్టార్ హీరోయిన్ల బోల్డ్ అటెంప్ట్… ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజీ’… 350 కోట్ల పవన్ కళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Bison OTT: ధ్రువ్ విక్రమ్ బైసన్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OG OTT : ఓజీ ఓటీటీలోకి అయితే వచ్చింది.. కానీ, పవన్ ఫ్యాన్స్‌నే హర్ట్ చేశారు

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

Big Stories

×