OG Collections: ఒక స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ(OG).. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోకి సెప్టెంబర్ 25వ తేదీన వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసిన విషయం తెలిసిందే. మొత్తానికైతే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. టోటల్ ఇప్పటివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఫుల్ రన్ ముగిసే సరికి ఈ సినిమా ఏరియా వైస్ ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..
ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.182 కోట్ల షేర్ రాబట్టి రికార్డు సృష్టించింది.
నిజామ్ ఏరియాలో గ్రాస్ రూ.86.5 కోట్లు కాగా
నిజామ్ ఏరియాలో షేర్ రూ.53.5 కోట్లు రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ షేర్ విషయానికి వస్తే..
ఉత్తరాంధ్ర – రూ.16.5 కోట్లు
వెస్ట్ – రూ.8.83 కోట్లు
తూర్పు – రూ.12.3 కోట్లు
కృష్ణ – రూ.9.75 కోట్లు
గుంటూరు – రూ.11.5 కోట్లు
నెల్లూరు – రూ. 4.8 కోట్లు
సీడెడ్ రూ.18 కోట్లు రాబట్టింది.
ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ షేర్ మొత్తం రూ.135.2 కోట్లు కాగా.. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణలో రూ.204 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
కర్ణాటకలో రూ.20.10 కోట్లు
తమిళనాడులో రూ.4 కోట్లు
కేరళలో రూ.0.6 కోట్లు
భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో రూ.6.8 కోట్లు కాగా
విదేశాలలో – 65 కోట్లు రాబట్టింది ఈ సినిమా.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే.. తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒకవైపు నటుడిగా.. మరొకవైపు డైరెక్టర్గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించిన జానీ సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచినా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకవైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు హీరోగా కూడా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరొకవైపు ఓజీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇప్పుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ALSO READ:Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!