BigTV English

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!
Advertisement

Dude Movie: తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డ్యూడ్(Dude) . కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు(Mamitha Baiju) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ విషయాన్ని తాజాగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారకంగా వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.


100 కోట్ల క్లబ్ లో వరుస మూడు సినిమాలు..

డ్యూడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీ కొట్టింది అంటూ మైత్రి వారు ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ నటించిన వరుస మూడు సినిమాలు  వందకోట్ల క్లబ్ లో చేరడం విశేషం. ప్రదీప్ హీరోగా నటించిన లవ్ టుడే, ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు మూడోసారి డ్యూడ్ సినిమా కూడా 100 కోట్లను రాబట్టడం విశేషం. ఇలా ఈ సినిమా వారం వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.

వారంలోనే 100 కోట్లు..

దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు భాషలలోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఇలా వారం రోజులలోనే వంద కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో జోరు కనబరుస్తోంది. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి, శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గగన్ పాత్రలో నటించిన ప్రదీప్ రంగనాథన్ లవ్ లో ఫెయిల్ అవుతాడు. ఆది కేశవులు పాత్రలో నటించిన శరత్ కుమార్ హీరోయిన్ మమతా బైజుకు (కుందన) తండ్రి పాత్రలో నటిస్తారు. గగన్ కుందన వరుసకు బావ మరదలు అవుతారు. వీరిద్దరూ ఇష్టపడిన విషయాన్ని తన మామయ్యకు చెప్పడంతో తన మామయ్య ఆదికేశవులు వీరిద్దరి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత వీరి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమా కథ.


ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే..నటుడుగా, యూట్యూబర్ గా మంచి సక్సెస్ అందుకున్న ప్రదీప్ అనంతరం దర్శకుడిగా కోమలి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అనంతరం నటుడిగా లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి డ్రాగన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు కూడా కీర్తీశ్వన్ దర్శకత్వం వహించటం విశేషం. డ్యూడ్ సినిమాకు కూడా కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు.

Also Read: Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

Related News

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Big Stories

×