OTT Movie : ఒక భయంకరమైన హారర్ సినిమాని చాలా మందికి చూడాలని ఉంటుంది. దాదాపు రెండు గంటల పాటు కదలనీయ కుండా చేయడానికి, సినిమాలో కూడా ఏదో విశేషం ఉండాలి కదా మరి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ నలుగురు అమ్మాయిలు ఒక మంత్ర గత్తెను కలిసిన తర్వాత వాళ్ళ జీవితం గందరగోళం లో పడుతుంది. ఒక శాపం వాళ్ళను వెంటాడుతుంది. క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి చుక్కలు కనడతాయి. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘బెద్దుఆ: ది కర్స్’ (Beddua: The Curse ) ఇది 2018లో వచ్చిన టర్కిష్ హారర్ మూవీ. అల్పర్ మెస్ట్చి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో బేయ్జానుర్ మెటె, ఎస్మా సోయ్సల్, సెరిఫె ఉన్సల్, అయ్లా గిజెమ్ తక్మా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 జూన్ 15న టర్కీలో విడుదల అయింది. IMDb 5.9/10లో దీనికి రేటింగ్ ఉంది. ఇది టర్కిష్ “ఉచ్ హార్ఫిలర్” సిరీస్‌లో 4వ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
మెలెక్, బుర్కు, ఎడా, అయ్లా అనే నాలుగు అమ్మాయిలు, హై స్కూల్ నుంచి మంచి స్నేహితులుగా ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్లు మళ్లీ కలుస్తారు. కోడి రోజులు సరదాగా గడపాలని అనుకుంటారు. ఈ సమయంలో వాళ్లు హావెల్ అనే ఒక వింత మాంత్రికురాలిని కలుస్తారు. హావెల్‌తో మాట్లాడుతుండగా, అక్కడ ఒక చిన్న గొడవ జరుగుతుంది. కోపంతో హావెల్ వాళ్లపై ఒక శాపం పెడుతుంది. ఈ శాపం వల్ల వాళ్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. వాళ్లకు భయంకరమైన సంఘటనలు మొదలవుతాయి. వాళ్ల స్నేహం కూడా గందరగోళంగా మారుతుంది.